ఇదేంపునర్విభజన? | - | Sakshi
Sakshi News home page

ఇదేంపునర్విభజన?

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

చేసింది ఇలా..

చేయాల్సింది ఇలా..

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒకే కాలనీ.. రెండు డివిజన్లు.. ఒక డోర్‌ నంబర్‌ ఒక డివిజన్‌లో.. పక్క డోర్‌ నంబర్‌ మరో డివిజన్‌లో.. రెండు డివిజన్లకు ఒకటే సరిహద్దులు. ఇది ఏలూరు నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన జరిగిన తీరు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించలేదు. కనీసం క్షేత్రస్థాయిలో తి రిగి ఏఏ డివిజన్‌లో పరిస్థితి ఏంటి.. 50 నుంచి 62కు ఎలా పెంచాలనే దానిపై కనీసం కసరత్తు లే దు. నేరుగా ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి టౌ న్‌ప్లానింగ్‌లో చక్రం తిప్పే సాధారణ సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శికి జాబితా ఇచ్చారు. అంతా బాగుందని వెంటనే ఖరారు చేశారు. కట్‌చేస్తే.. పునర్విభజనపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పాటు అధికార జనసేన పార్టీ కూడా భగ్గుమంది.

62 డివిజన్లకు..

నగర డివిజన్లను 50 నుంచి 62కు పెంచారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 2.24 లక్షలు. 2021 జనాభా లెక్కల ప్రకారం 3.04 ల క్షలకు 7 విలీన పంచాయితీలు కలిపితే చేరింది. డివిజన్ల పెంపు కోసం జనాభాను గణనీయంగా పెంచారనేది రాజకీయ పార్టీల ఆరోపణ. ఇక పునర్విభజన తీరుపై సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. తప్పుల తడకతో పునర్విభజన ప్రాథమిక ప్రకటన చేశారు. పాత 1వ డివిజన్‌ కొత్త 3వ డివిజన్‌, పాత 2వ డివిజన్‌ కొత్త 4వ డివిజన్‌ హద్దులు అడ్డగోలుగా మార్చేశారు. 2,500లు ఓటింగ్‌ ఉన్న పాత 13వ డివిజన్‌ లోని వైఎస్సార్‌ కాలనీని రెండు ముక్కలు చేసి 11వ డివిజన్‌లో కొంత, 24వ డివిజన్‌లో కొంత కలిపే శారు. ఒకే ప్రణాళికతో నిర్మించిన వైఎస్సార్‌ కాలనీ లోని ఇళ్లను కొత్త సరిహద్దులు పెట్టి రెండు ముక్కలు చేయడంపై గందరగోళం రేగింది. డ్రైనేజీ, తాగునీ రు, పారిశుద్ధ్యం, ఇతర సమస్యల కోసం రెండు డివిజన్ల చుట్టూ తిరిగాలా..? విభజన కాదు ఐక్యతే అభివృద్ధి అంటూ కాలనీవాసులు నగర కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వడంతో పాటు సోషల్‌ మీడియాలో క్యాంపెయినింగ్‌ చేస్తున్నారు. మరో అద్భుతమేమిటంటే.. కొత్తగా 14, 15 డివిజన్లకు రెండింటికీ ఒకే హద్దులను నిర్ణయించి ప్రకటించారు.

ఎలాంటి మార్గదర్శకాలు పాటించలేదు. ఏలూరు నగర కమిషనర్‌ పరిధిలో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది పునర్విభజన ప్రక్రియ సరిహద్దులను శాసీ్త్రయంగా నిర్ణయించారు. కాని సర్వే నంబర్లు, కాల్వ హద్దులు, చెరువు హద్దులు, ప్రధాన రోడ్డు హద్దులు తీసుకుని మూడు రోజులపాటు ఒకే చోట కూర్చొని పెద్ద కసరత్తు చేశారు. నగర కమిషనర్‌ నేతృత్వంలో ఏసీపీ స్థాయి అధికారి ఈ ప్రక్రియ మొత్తం నిర్వహించారు. అయితే చేసింది వార్డు సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శి. ఎలాంటి అవగాహన, అనుభవం లేకుండా సర్వే నంబర్లతో చేసి కొత్త గందరగోళం సృష్టించారు. కేవలం వార్డు సచివాలయ కార్యదర్శికి నగరంపై అవగాహన ఏ మాత్రం ఉంటుంది. దశాబ్దాలుగా కొనసాగే డివిజన్ల విషయంలో నగరపాలక సంస్థ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేవలం ఐదారేళ్ల స ర్వీసు అనుభవం ఉన్న చిన్నపాటి ప్లానింగ్‌ కార్యదర్శికి టీపీబీఓ పోస్టు కట్టపెట్టి ఆయనతో డ్రాఫ్ట్‌ సిద్ధం చేయించడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నారు.

డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రతి డివిజన్‌లో ఒక డోర్‌ నంబర్‌ నుంచి ఒక డోర్‌ నంబర్‌ వరకు ఎంపిక చేసుకుని సగటున 4,500 నుంచి 5 వేల ఓట్లకు 10 శాతం అటుఇటుగా డివిజన్లను ఖరారు చేయాలి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 2.24 లక్షల ఓటింగ్‌ ఏలూరులో పోలైంది. 7 విలీన గ్రామాలు కలుపుకుని మొత్తం ఓట్లను 62 డివిజన్లల్లో సగటున 4 నుంచి 5 వేలు వచ్చేలా రూపొందించారు. అది కూడా ప్రజలందరికీ తెలిసే డోర్‌ నంబర్లు, ప్రధాన సెంటర్ల పేరుతో జాబితాను రూపొందించి కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసి అభ్యంతరాలను స్వీకరించాలి. అలాగే రాజకీయ పార్టీల సూచనలు తీసుకోవాలి.

ఏలూరులో 14, 15 డివిజన్లకు ఒకే హద్దులు

తప్పుల తడకలతో డివిజన్ల పునర్విభజన జాబితా

వైఎస్సార్‌ కాలనీ రెండు ముక్కలు

50 డివిజన్ల నుంచి 62 డివిజన్లకు కార్పొరేషన్‌ పెంపు

పునర్విభజనపై పార్టీల అభ్యంతరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement