ఆశల పొగాకు | - | Sakshi
Sakshi News home page

ఆశల పొగాకు

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

ఆశల పొగాకు

వేలం కేంద్రాల్లో ధరలు (కిలోకు రూ.లలో)

రైతులను ఊరిస్తున్న ధరలు

వైఎస్‌ జగన్‌ పర్యటన అనంతరం ధరల పెరుగుదల

కిలో రూ.346 గరిష్ట ధర

ఒక్కరోజే 4,233 బేళ్ల విక్రయాలు

బుట్టాయగూడెం : ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వర్జీని యా పొగాకు ధరలు ప్రస్తుతం పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. దాదాపు ఐదు నెలలుగా కిలో రూ.265 ధర కొనసాగగా జూలై 25 నుంచి కాస్త నెమ్మదిగా ధరలు పెరుగుతున్నాయి. అయితే పొగాకు ధరలు ప్రారంభం నుంచి గిట్టుబాటు కాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో గత నెల 5న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మార్కెట్‌లో ధర పెరుగుతూ వస్తోంది. ఈనెల 4న కిలోకు గరిష్ట ధర రూ.328 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో బుధవారం రూ.326, గురువారం రూ.345, శుక్రవారం రూ.346కు పెరిగింది. ఒక్కసారిగా కిలోకు రూ.19 నుంచి రూ.20 పెరగడం గమనార్హం. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కిలోకు గరిష్టంగా రూ.453, సగటున రూ.311 ధరలు రైతులకు లభించాయి.

ఒక్కరోజే 5.50 లక్షల కిలోల విక్రయం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం 1,2, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురంలోని వేలం కేంద్రాల పరిధిలో శుక్రవారం ఒక్కరోజు 5,50,000.60 కిలోల వరకూ విక్రయాలు జరిగినట్టు పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ జె.సురేంద్రకుమార్‌ తెలిపారు. అలాగే గరిష్టంగా కిలో రూ.346, సగటున రూ.315.08 చొప్పున ధర పలికినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1 పరిధిలో 1,22,412.20 కిలోలు, జంగారెడ్డిగూడెం–2 పరిధిలో 1,37,794.80 కిలోలు, కొయ్యలగూడెంలో 1,17,572.60 కిలోలు, గోపాలపురంలో 1,26,998.60 కిలోలు, దేవరపల్లిలో 45,222.40 కిలోల చొప్పున కొనుగోలు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ధర ఆశాజనకంగా ఉందని నాణ్యత కలిగిన బ్రైట్‌ గ్రేడ్‌ పొగాకు మంచి ధర పలుకుతుందని చెప్పారు. అలాగే రైతుల దగ్గర నుంచి సుమారు 67 మిలియన్‌ కిలోల వరకూ పొగాకు అమ్మకానికి ఉందని ఆర్‌ఎం తెలిపారు. మొత్తం ఐదు కేంద్రాల పరిధిలో 5,267 బేళ్లు అమ్మకానికి రాగా ట్రేడర్లు 4,233 బేళ్లు కొనుగోలు చేశారు. 1,034 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకూ 26.35 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు చేశారు.

వేలం కేంద్రం గరిష్టం కనిష్టం సగటు

జంగారెడ్డిగూడెం–1 345 150 283.92

జంగారెడ్డిగూడెం–2 345 150 284.11

కొయ్యలగూడెం 345 150 273.02

గోపాలపురం 346 150 295.96

దేవరపల్లి 345 150 315.08

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement