నేడు జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌ అటవీ అమరవీరులకు నివాళి నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యం ఫొటో ఓటరు జాబితా ప్రదర్శన

జిల్లా జడ్జి శ్రీదేవి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ శనివారం ఉదయం 11 గంటల నుంచి జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్టు జిల్లా జడ్జి ఎస్‌.శ్రీదేవి ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవ సదన్‌ భవనంలో కార్యక్రమం నిర్వహిస్తామని, కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రకృతి సంపదను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీ శాఖ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా అటవీ శాఖాధికారి పీవీ సందీప్‌రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. అటవీ అమరవీరుల త్యాగాలను మననం చేసుకుంటూ నివాళులర్పించారు. డీఎఫ్‌ఓ సందీప్‌రెడ్డి మాట్లాడుతూ అటవీ అమరవీరుల ఆదర్శాలను, కర్తవ్య నిష్టను ప్రతిఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. డివిజన్‌ పరిధిలోని అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల స్మారకార్థం అటవీ శాఖ సిబ్బందితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఏలూరు డివిజన్‌ పరిధిలోని ఏడు అటవీ రేంజ్‌లలో కూడా సంబంధిత రేంజ్‌ అధికారులు, సిబ్బంది అటవీ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ర్యాలీలు నిర్వహించారు.

జంగారెడ్డిగూడెం (చింతలపూడి): పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని డీఈఓ పి.వెంకటలక్ష్మమ్మ, డీవైఈఓ రామన్న దొర అన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌ పరిధిలోని ఎంఈఓలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతా ప్ర మాణాలతో, పరిశుభ్రంగా నిర్వహించాలని ఆ దేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హా జరు శాతాన్ని రోజూ డిజిటల్‌ పద్ధతిలో న మోదు చేస్తూ వంద శాతం హాజరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మన బడి మన భవిష్యత్తు కింద పాఠశాలల్లో చేపట్టిన సివిల్‌ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ పరిధిలోని 48 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ స్థానా లకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాలను ఈనెల 11న ప్రచురించి, జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్ధం అందుబాటులో ఉంచామని జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ జీవీకే మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ని అనుసరించి ఈ జాబితాను ప్రచురించినట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement