భూసేకరణలో నిర్లక్ష్యం సహించం | - | Sakshi
Sakshi News home page

భూసేకరణలో నిర్లక్ష్యం సహించం

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

భూసేకరణలో నిర్లక్ష్యం సహించం ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

జేసీ అభిషేక్‌ గౌడ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీ సుకుంటామని జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ హెచ్చరించారు. పథకం పనుల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. 40 రోజులుగా ఎటువంటి ప్రగతి ప్రదర్శించకపోవడంపై కొవ్వూరు భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూ చించారు. జిల్లాలో ఈ–క్రాప్‌, ఈ–కేవైజీ క చ్చితంగా నమోదు చేయాలని అన్నారు. నూ జివీడు సబ్‌ కలెక్టర్‌ బి.వినూత్న, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్‌ బాషా పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వహించే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ శుక్రవారం ప్రకటనలో తెలి పారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మండలపరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల ల్లోని 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలన్నారు. నవంబర్‌ 15న పరీక్ష నిర్వహిస్తారని, ఓబీసీ విద్యా ర్థులు రూ.100, ఎస్‌సీ, ఎస్టీలు రూ.50 వచ్చే నెల 12లోపు చెల్లించాలన్నారు. వచ్చేనెల 13 తో ఫీజు చెల్లింపు గడువు ముగుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement