లో గ్రేడ్‌ ధర పెంచాలి | - | Sakshi
Sakshi News home page

లో గ్రేడ్‌ ధర పెంచాలి

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

లో గ్రేడ్‌ ధర పెంచాలి జగన్‌ పర్యటన తర్వాతే..

హైగ్రేడ్‌ పొగాకు ధర పెరుగుతున్నా లోగ్రేడ్‌ పొగాకు అమ్మకాల్లో నష్టం వస్తుంది. కిలో రూ.150కు మించి కొనుగోలు చేయడం లేదు. మరో రూ.100 పెంచితే నే రైతులకు కొంతైనా మేలు జరుగుతుంది. ఒకటి, రెండు బేళ్లకు మాత్రమే ఎక్కువ ధర వస్తుండటం, మిగిలిన బేళ్లకు ధర రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.

– కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి పొ గాకు బోర్డును సందర్శించిన తర్వాత క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. గోపాలపురం కేంద్రంలో అత్యధికంగా కిలో రూ.346 పలికింది. అయితే తక్కువ గ్రేడ్‌కు రూ.150 మాత్రమే రావడం ఇబ్బందికరం. లోగ్రేడ్‌ ధరలు కూడా పెంచి కొనుగోలు చేయాలి.

– సయ్యద్‌ బాజీ, పొగాకు రైతు, అచ్చియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement