తాడేపల్లిగూడెం (టీఓసీ): దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు గురువారం పట్టణంలో కోరారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని, పీఎల్‌ఐని ఉపసంహరించుకోవాలని, ఇతర పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ తోట సూర్యనారాయణ, ఎస్‌బీఐ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మానుకొండ కిరణ్, బి. ఏడుకొండలు, లింగంపల్లి గాంధీ, శీతాళం నారాయణమూర్తి, వీరబాబు, సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన శాస్త్రి, చంద్రకళ, అపర్ణరాజు తదితర సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


