ఆటోలో డ్రమ్ములతో కోళ్ల వ్యర్థాలు | - | Sakshi
Sakshi News home page

ఆటోలో డ్రమ్ములతో కోళ్ల వ్యర్థాలు

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

ఆటోలో డ్రమ్ములతో కోళ్ల వ్యర్థాలు

దెందులూరు: ఆటోలో కోళ్ల వ్యర్థాలను పోతునూరు శివారులోని చేపల చెరువులకు తరలిస్తుండగా దెందులూరు ఎస్సై డి.వెంకట్‌కుమార్‌కు పట్టుబడ్డారు. సంఘటన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 6న గుండుగొలను నుంచి పోతునూరు చెరువుల వైపు వెళ్తున్న ఆటోను వెంబడించగా, ఆటోలో ఉన్న వ్యర్థ పదార్థాల డ్రమ్ములు రెండు కింద పడిపోయాయి. అదే సమయంలో అదుపుతప్పి ఆటో చెరువులో పడిపోయిందని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్‌ కర్నాటి ప్రభాకర్‌రాజు, తేరా రాజశేఖర్‌తో పాటు హనుమాన్‌ జంక్షన్‌లోని కారుణ్య చికెన్‌ సెంటర్‌ యజమానిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణలో భాగంగా మొత్తం 8 డ్రమ్ములతో చికెన్‌ వ్యర్థాలను తరలిస్తున్నట్లు నిర్ధారణ అయిందని ఆయన పేర్కొన్నారు.

చెరువులో పడిన ఆటో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement