నూజివీడు: పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ హైస్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డీవీఎల్ పుష్పలత సోమవారం తెలిపారు. ఈ నెల 23 నుంచి జమ్మూకాశ్మీర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో వీరు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఆమె పేర్కొన్నారు. అండర్–12 బాలుర విభాగంలో కే. హరీష్‌కుమార్, పీ. మహేష్, ఎస్. వర్ధన్‌బాబు, సీహెచ్. వీరేంద్ర, బాలికల విభాగంలో పీ. హరిశ్రీ ఈ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను హెచ్‌ఎంతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.


