కామవరపుకోట: జీలకర్రగూడెం గ్రామానికి చెందిన పలువురు జనసేన పార్టీని వీడి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు సమక్షంలో, మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంగిర్తి వర్మ, ఇంగిర్తి పౌలు, చెమటపాము బలివియ్య పార్టీ కండువా కప్పుకుని వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయి పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని, అందుకే ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్సార్‌సీపీకి ప్రజల నుంచి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ... జనసేనలో ఎంత కష్టపడినా సరైన గుర్తింపు లేకపోవడం వల్లే వైఎస్సార్‌సీపీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి గుర్రాల రవి, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భీమిరెడ్డి వెంకన్నబాబు, కామవరపుకోట 1వ సచివాలయం అధ్యక్షుడు తమ్మిశెట్టి గిరిజ సుబ్రహ్మణ్యం, సేవా శీను, అల్లూరి పెద్దిరాజు, మండల ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి సూర్యప్రకాష్, నాగళ్ల సీతారాంబాబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


