ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. విజయ్‌కుమార్ అధ్యక్షతన ఆదివారం నగరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వినాయక చవితిలోపు మంజూరు చేసి చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి, అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థల కేటాయింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏలూరు జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. గౌరవ అధ్యక్షుడిగా ఇసుకపల్లి తాతారావు, అధ్యక్షుడిగా మోటేపల్లి చంద్రశేఖర్, కార్యదర్శిగా వి. రామ్‌ప్రసాద్, కోశాధికారిగా ఎల్. వెంకటరావుతో పాటు పలువురు సలహాదారులు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కె. శివకుమార్, జాయింట్ సెక్రటరీ సూర్యప్రకాష్ పాల్గొన్నారు.


