ఇటీవల సదస్సులోనే మా భూములు ఇచ్చేది లేదని అధికారులకు స్పష్టంగా చెప్పాం. అయినా మళ్లీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు మా భూముల్లోకి రావడం అన్యాయం. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పచ్చని పొలాలను కార్పొరేట్ కంపెనీల కోసం లాక్కోవాలని చూస్తే సహించేది లేదు.
– చేపూరి ఖాదర్ బాబు, మాజీ జెడ్పీటీసీ,
రైతు, శెట్టివారిగూడెం
భూగర్భ గ్యాసిఫికేషన్ అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియ. భూగర్భ జలాలు విషపూరితమైతే మేము, మా పశువులు ఏం తాగి బతకాలి? పంటలు పండక, తాగేందుకు నీరు లేక భవిష్యత్తులో ఈ ఊళ్లను వదిలి రోడ్డున పడాల్సిందేనా? మా ప్రాణాలు పోయినా భూములను వదులుకోం.
– యర్రంశెట్టి రామకృష్ణారావు, రైతు, సుబ్బారాయుడుగూడెం
ఇక్కడ ఎకరం భూమి రూ.40 నుంచి 50 లక్షల పైనే ఉంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, పర్యావరణ ప్రభావంపై ఉన్న అనుమానాలను మొదట నివృత్తి చేయాలి. బలవంతపు సేకరణలు కుదరవు. ప్రభుత్వమే ముందుకు వస్తే మార్కెట్ ధరకు రెట్టింపు పరిహారం ఇవ్వాలి. అప్పటివరకు సర్వేలను అడుగు కూడా ముందుకు పడనివ్వం.
– గోలి చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, వ్యాపారవేత్త, చింతలపూడి


