వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు: సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర వెలకట్టలేనిదని, భావిభారత పౌరులను తీర్చిదిద్దే శిల్పిలు ఉపాధ్యాయులని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎ న్నార్) కొనియాడారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వై.వేణుగోపాలరావు, వి.రాజారా వు, జి.వెంకటరావు, జె.బోయాజ్‌లను సన్మా నించారు. ముందుగా రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళి అర్పించారు. పార్టీ మండలాధ్యక్షు డు శింగంశెట్టి రాము, పట్టణ అధ్యక్షుడు స మయం వీరాంజనేయులు (అంజి), నాయకు లు దానం నవరత్నకుమారి, తోట మహేష్, సాధు కొండయ్య, అబ్దుల్ మాలిక్, బూరుబో యిన మోహనరావు, ఉచ్చుల చినరాజు, సో మల శ్యామ్‌సుందర్, బండి ప్రసాద్, ముంగర గోపాలకృష్ణ, మడక శ్రీను పాల్గొన్నారు.


