వరలక్ష్మీ నమోస్తుతే | - | Sakshi
Sakshi News home page

వరలక్ష్మీ నమోస్తుతే

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం పట్టణ ప్రజల ఇలవేల్పు, ఆరాధ్య దైవం మావుళ్లమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో చీర, రవికతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది పటిష్ట ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూ జలు జరిగాయి. అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మ హాలక్ష్మీ నగేష్‌, ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement