ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఫీడ్ ధరను కేజీకి రూ.10 నుంచి రూ.12 వరకు పెంచారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం తప్పదు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. టన్ను 100 కౌంట్ రొయ్య పంటకు రూ.2,72,000 ఖర్చవుతోంది. మేత ధరల పెంపుతో టన్ను రొయ్యలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపోతాం. ఇష్టానుసారం పెంచిన రేట్లను తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.
– చవ్వాకుల సత్యనారాయణమూర్తి, రొయ్యల రైతు
నేను 25 ఎకరాల రొయ్యల సాగు చేస్తున్నా. ఫీడ్ తయారీ, ప్రాసెసింగ్ ప్లాంట్ల, రొయ్యల మందుల యజమానులు సిండికేట్‌గా మారి ని లువునా దోచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కనుసన్నల్లోనే సిండికేట్ వ్యవస్థ నడుస్తోంది. ఫీడ్ తయారీ ఉత్పత్తులు పెరిగాయన్న సాకుతో రేట్లు పెంచేశారు. తయారీ ఉత్పత్తులు తగ్గినప్పుడు ఎందుకు రేట్లు తగ్గించడం లేదు. ఎప్పుడైనా అదనపు భారం చివరకు రైతులపైనే పడుతుంది.
– కావలి దాము, ఆక్వా రైతు, నందమూరిగరువు
రొయ్యల రైతును చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఆక్వా రైతు లు, ఫీడ్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో కిలోకు రూ.4 తగ్గిస్తారని చెప్పి, రూ.2 తగ్గించి చేతులు దులుపుకున్నారు. ఇదంతా చూస్తే చంద్రబాబు మాటకు విలువ లేకుండా పోయిందా..? లేదా చంద్రబాబు ఫీడ్ యజమాలతో కుమ్మక్కయ్యారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ హ యాంలో రొయ్యల రైతుల సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేవి.
– బొల్లెంపల్లి శ్రీనివాసచౌదరి, రొయ్యల రైతు, అండలూరు


