ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు వచ్చాయని వాటి గురించిన అవగాహన కలిగి ఉండాలని ఏలూరు వన్‌టౌన్ ఎస్సై సుధాకర్ సూచించారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఏలూరు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్, శక్తి టీం సభ్యులు వెన్నవల్లివారి పేట ఉర్దూ పాఠశాలలో విద్యార్థినులకు కొత్త చట్టాలు, మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను గురించి అవగాహన కార్యక్రమాన్ని గురువారం ని ర్వహించారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందు కు సాగాలని, వేధింపులు, ఇబ్బందులు ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను లేదా డయల్ 112 లేదా పోలీసులను సంప్రదించాలని సూచించా రు. శక్తి యాప్ ద్వారా కూడా సహాయం పొందవచ్చని సూచించారు.


