న్యూస్‌రీల్
కృత్రిమ గర్భధారణ వేగిరపర్చాలి
పశువుల కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రామ్మోహన్‌రావు సిబ్బందికి ఆదేశించారు. 8లో u
పోలవరం జలాలతో దివంగత మహానేతకు జలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. గోదావరి జలాలను పోలవరం కుడికాలువ నుంచి ప్రత్యేకంగా ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తీసుకువచ్చి మరీ జలాభిషేకం చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉభయగోదావరితో పాటు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని మాజీ సీఎం వైఎస్సార్ తలంచారు. దానికనుగుణంగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మహానేత చలువతో కుడికాలువ జలాలు పశ్చిమకు చేరుతుండటంతో ఆయన్ని స్మరిస్తూ జలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ద్విచక్ర వాహనాల చోరీ కేసును పోలవరం పోలీసులు ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయకృష్ణ తెలిపారు. 8లో u
గురువారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కై కలూరు: సంత మార్కెట్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు
ఏలూరు: గోదావరి జలాలతో అభిషేకం చేస్తున్న కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లావ్యాప్తంగా బుధవారం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కై కలూరు నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి మండలాల్లో పార్టీ సమన్వయకర్త, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడు తూ ప్రజల మదిలో దివంగత వైఎస్సార్ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారని, ఆయన హయాంలో ప్రారంభమైన పనులతో జిల్లాలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొనియాడారు.
ఉంగుటూరు నియోజకవర్గం.. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం జలాలతో నియో జకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి అనంతరం పూలమాలలు వేశారు.
ఏలూరు నియోజకవర్గం.. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటరులో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెయింట్ ఆన్స్ కళాశాల వద్ద ఉన్న విగ్రహానికి గోదావరి జలాలతో జలాభిషేకం చేశారు. అనంతరం మార్కెట్ యార్డు వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలకు ర్యాలీగా వెళ్లి నివాళులర్పించారు.
నూజివీడు నియోజకవర్గం.. నూజివీడులో చినగాంధీ బొమ్మ సెంటరులో వైఎస్సార్ చిత్రపటానికి నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలవరం నియోజకవర్గం.. బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు మహానేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
చింతలపూడి నియోజకవర్గం.. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో పార్టీ నియోజకరవ్గ సమన్వయకర్త కంభం విజయరాజు దివంగత నేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చింతలపూడి పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు పులిహోర, దుప్పట్ల పంపిణీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
దెందులూరు నియోజకవర్గం.. దెందులూరు, పెదవేగి మండలాల్లో ఏపీ ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మనసున్న మారాజుకు నీరాజనం
వాడవాడలా వైఎస్సార్ వర్ధంతి
పోలవరం జలాలతో దివంగత వైఎస్సార్ విగ్రహాలకు అభిషేకం
జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు


