ఏలూరులో ‘ఎపిక్‌’ సందడి | - | Sakshi
Sakshi News home page

ఏలూరులో ‘ఎపిక్‌’ సందడి

Sep 3 2026 4:03 AM | Updated on Sep 3 2026 4:03 AM

ఏలూరులో ‘ఎపిక్‌’ సందడి దేవీపట్నం వైపు పెద్ద పులి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ నిరుద్యోగ యువతకు శిక్షణ కృత్రిమ అవయవాల పంపిణీ జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓగా మల్లికార్జునరావు అత్తారింటికి వెళ్తూ అనంతలోకాలకు..

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో బుధవారం ఎపిక్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ చిత్ర నటీనటులు సందడి చేశారు. స్థానిక ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలకు వచ్చి విద్యార్థులతో ముచ్చటించారు. ఇది మంచి ఫీల్‌ ఉన్న ప్రేమకథా చిత్రమని, యువతకు వినోదం, అనుభూతి పంచుతాయని హీరో ఆనంద్‌ దేవరకొండ అన్నారు. ఈ చిత్రాన్ని ఆ దరించి, మరిన్ని మంచి చిత్రాలు తీసేలా ప్రో త్సహించాలని హీరోయిన్‌ వైష్ణవి చైతన్య కోరారు. కళాశాల ప్రిన్సిపాల్‌ పి.బాలకృష్ణ ప్రసాద్‌, హెచ్‌ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు సమీ పం నుంచి పెద్ద పులి గోదావరి దాటి పోలవరం జిల్లా వైపు వెళ్లిపోయింది. ప్రాజెక్టు సమీపంలోని సింగన్నపల్లి నుంచి నది దాటి దేవీపట్నం మీదుగా వెళ్లినట్టు అటవీ శాఖ అధికా రులు ట్రాకర్‌ ద్వారా గుర్తించారు. గత వారం రోజులుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అభయారణ్యంలో సంచరించిన పెద్ద పులి ఒక దూడను హతమార్చి, మరో దూడను గాయాలపాలు జేసింది. తిరిగి గోదావరి నది దాటి వెళ్లినట్టు పోలవరం అటవీ శాఖ రేంజ్‌ అధికారి ఎస్‌కే వలీ తెలిపారు.

ఏలూరు (టూటౌన్‌): దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజనలో భాగంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఫ్లాగ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కె.శ్రీకాంత్‌ ప్రకటనలో తెలిపారు. సోలార్‌ రూఫ్‌టాప్‌ ఇన్‌స్టలేషన్‌ అండ్‌ సర్వీస్‌, మల్టీ స్కిల్‌లో మూడు నెలలపాటు శిక్షణ ఇస్తామన్నారు. ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు అర్హులని, వివరాలకు 7901332323, 8328450627 నంబర్లలో సంప్రదించాలన్నారు.

భీమవరం: ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల ని రుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.ముక్కంటి బుధవారం ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్‌ టెక్నీషియన్‌, కిసాన్‌ డ్రోన్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రీషి యన్‌–స్మార్ట్‌ ఎనర్జీ, సోలార్‌ పీవీ ఇన్‌స్టాలర్‌, ఫార్మా బయోలాజిక్స్‌, వైద్యపరికరాలు, ఏ1 డేటా ఇంజనీరింగ్‌ ఎనలిస్ట్‌, జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్డులకు ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 6వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని, మరి న్ని వివరాలకు సెల్‌ 9701355337, 97058 63666, 9393527666, 9640294967 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు దొండపాడులోని ఉమా ఎడ్యుకేషన్‌–టెక్నికల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో దివ్యాంగులకు బుధవారం ఉచితంగా కృత్రిమ అవయవాలను అందజేశారు. కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి కృత్రిమ అవయవాలను అందించి మాట్లాడుతూ దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్‌ ఇన్‌చార్జి సీఈఓగా జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఈఓగా పనిచేసిన పి.జగదాంబ గత ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు.

అశ్వారావుపేట రూరల్‌: అత్తారింటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగి ంది. ఎస్సై టి.యయాతీరాజు కథనం ప్రకారంఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రామ చంద్రాపురానికి చెందిన దాబా మంగబాబు (30) ద్విచక్రవాహనంపై కొల్లూరిగూడెంలోని అత్తారింటికి వెళ్తున్నాడు. కన్నాయిగూడెం శివా రు మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన ట్రా క్టర్‌ ఢీకొట్టింది. దీంతో మంగబాబు అక్కడిక్క డే మృతి చెందాడు. ఆయనకు భార్య సంధ్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement