పేదల హృదయాల్లో.. చెరగని సంతకం | - | Sakshi
Sakshi News home page

పేదల హృదయాల్లో.. చెరగని సంతకం

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

నిర్వాసిత సర్వేలో జాప్యం ‘కొబ్బరి’ కల్పవృక్షమే!

న్యూస్‌రీల్‌

జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు : ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

నిర్వాసిత సర్వేలో జాప్యం
కుక్కునూరుకు చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల ఇళ్ల నిర్మాణాల ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ సర్వేను అధికారులు ప్రకటించిన తేదీల్లో నిర్వహించ లేదు. 8లో u
సమస్య తక్షణ పరిష్కారం కంటే శాశ్వత పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు... దశాబ్దాలుగా నిలిచిపోయే కీలక ప్రాజెక్టులకు బీజం వేశారు.. అన్నదాత నుంచి సామాన్యుడి వరకు అందరికీ మేలు జరిగేలా, ప్రతి నియోజకవర్గ రూపురేఖలు, అభివృద్ధి పరుగులతో మారేలా బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. శాశ్వత అభివృద్ధితో ఉమ్మడి పశ్చిమ జిల్లావాసుల మదిలో అభివృద్ధి ప్రదాతగా దివంగత వైఎస్సార్‌ నిలిచారు. ఏజెన్సీలో పోడు భూముల పంపిణీ నుంచి లక్షలాది మందికి అన్నదాతలకు సాగునీరందించే పోలవరం ప్రాజెక్టు వరకు ప్రతీది మహానేత హయాంలోనే సాగింది.

ఏటా సెప్టెంబర్‌ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి ప్రాంతంలో కొబ్బరి సాగు, రైతుల పరిస్థితిపై ప్రత్యేక కథనం. 8లో u

బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సుస్థిర అభివృద్ధికి మహానేత వైఎస్సార్‌ హయాంలో అంకురార్పణ జరిగింది. ప్రతి నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను శాశ్వత రీతిలో పరిష్కరించడంతో పాటు దీర్ఘకాలంలో జిల్లా రూపురేఖలు మార్చే ప్రాజెక్టుకు సైతం అంకురార్పణ ఆయన హయాంలోనే పడింది. నూజివీడు ట్రిపుల్‌ఐటీ, తాడేపల్లిగూడెం హార్టికల్చర్‌ యూనివర్శిటీ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం బృహత్తర ప్రాజెక్టు ఇలా అన్ని ప్రాజెక్టులు ఆయన చలవే.

పోడుతో గిరి‘జనం’కు మేలు

పోడు భూముల పంపిణీతో గిరిజనులకు మేలు చేశారు.అటవీ సంపదపై ఆధారపడే గిరిజనులను సాగువైపు మళ్లించి సుస్థిర ఆదాయం సాధించేలా బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు. దానికనుగుణంగా పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో4500 ఎకరాల పోడుభూములను 2200 మంది గిరిజనులకు పంపిణీ చేశారు. ఆ భూముల్లో ప్రస్తుతం వరి, పొగాకు, మొక్కజొన్న, ఉద్యానవనసాగు పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఏజెన్సీ ప్రజల మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెంలో 100 పడకల ప్రభుత్వాసుపత్రికి కూడా ఆయన హయాంలోనే శంకుస్థాపన జరిగింది.

తమ్మిలేరు ముంపు నుంచి ఏలూరుకు రక్షణ

2005లో తమ్మిలేరు వరద ఉధృతికి ఏలూరు నగరం అతలాకుతలమైంది. దీంతో శాశ్వత పరిష్కారం కోసం 2005లో తమ్మిలేరు రిటైనింగ్‌వాల్‌ను మంజూరు చేసి రూ.17 కోట్లతో పనులు ప్రారంభించారు. తదనంతరం పాలకుల నిర్లక్ష్యంతో ఆగిపోయిన పనులను మళ్లీ 2024లో ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పూర్తయ్యింది. ఏకకాలంలో లక్షల క్యూసెక్కులు వచ్చినా ఏలూరు నగరానికి ఎలాంటి ముప్పువాటిల్లకుండా కిలోమీటరు మేర రిటైనింగ్‌వాల్‌ నిర్మించారు.

చింతలపూడికి మొదటి అడుగు

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి దివంగత వైఎస్సార్‌ 2008లో శంకుస్థాపన చేశారు. 15 మెట్ట ప్రాంత మండలాల్లో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరివ్వడం కోసం రూ.1701 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాల్వల నిర్మాణ పనులు, ఇతర పనులు కొంత మేరకు పూర్తి చేసిన క్రమంలో కోర్టు కేసులు దాఖలయ్యాయి. వాటిన్నంటిని అధిగమించి పనులు చేశారు. తదనంతరం పాలకులు ప్రాజెక్టు పరిధిని, విస్తీర్ణాన్ని, వ్యయాన్ని గణనీయంగా పెంచుకుంటూ వెళ్లారు తప్ప ప్రాజెక్టు పూర్తి పై దృష్టి మాత్రం సారించలేదు.

కై కలూరు: దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, గ్రామాల్లో ఘనంగా బుధవారం నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌) తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కై కలూరు నియోజకవర్గానికి సంబంధించి ఉదయం 8 గంటలకు కై కలూరు సంతమార్కెట్‌ వైఎస్‌ భారీ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా హాజరుకావాలని డీఎన్నార్‌ కోరారు.

నేడు దివంగత నేత వైఎస్సార్‌ వర్ధంతి

ఏలూరులో రిటైనింగ్‌వాల్‌, ఏజెన్సీలో పోడు భూముల పంపిణీ

నూజివీడులో ట్రిపుల్‌ఐటీతో విద్యా ప్రదాతగా మారిన వైనం

ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌ శాశ్వత అభివృద్ధి ముద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement