రాష్ట్రస్థాయి పోటీలకు గురుకులం విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు గురుకులం విద్యార్థులు

Sep 2 2026 2:52 AM | Updated on Sep 2 2026 2:52 AM

రాష్ట్రస్థాయి పోటీలకు గురుకులం విద్యార్థులు డీపీవోకు స్వల్పగాయాలు ప్రమాదవశాత్తూ చీరకు నిప్పంటుకుని మహిళ మృతి ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మృతి

పెదవేగి: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు పెదవేగి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ ఎం.రమేష్‌ బాబు, వైస్‌ ప్రిన్సిపాల్‌ నిర్మల, ఫిజికల్‌ డైరెక్టర్‌ జయరాజ్‌ తెలిపారు. ఈ నెల 11 నుంచి 13 వరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌–జూనియర్స్‌ బాలుర పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టుకు గురుకుల పాఠశాల నుంచి ఎంజే వర్మకుమార్‌, కే. జోషన్‌, ఏ.పూర్ణనంద, పీ.అజయ్‌, కే.సుదీప్‌ ఎంపికయ్యారు. అలాగే, ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు కడపలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్స్‌ విభాగపు పోటీలకు యూ దురా్‌ాగరావు, ఎస్‌.జస్వంత్‌, ఈ. సూర్య, బీ. మహేష్‌, జీ. రాజశేఖర్‌, హెన్రీ, ఎన్‌. నవసంపత్‌, బీ. రాజు, బీ. అభిరామ్‌ ఎంపికై నట్లు వారు వెల్లడించారు.

ఉంగుటూరు: జాతీయ రహదారిపై బాదంపూడి వద్ద డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జీవీకే మల్లికార్జునరావు త్రుటిలో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జయింది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వస్తుండగా బాదంపూడి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో డీపీవో మల్లికార్జునరావుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఉంగుటూరు ఎంపీడీవో రాజ్‌మనోజు, డిప్యూటీ ఎంపీడీవో రమేష్‌బాబు, సూపరింటెండెంట్‌ హనుమాన్‌ బాబు తాడేపల్లిగూడెం వెళ్లి డీపీవోను పరామర్శించారు.

ఉంగుటూరు: మతిస్థిమితం లేని ఓ మహిళ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల లక్ష్మి (50) కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున పొయ్యి వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుని మంటలు చెలరేగి ఒళ్లంతా తీవ్రంగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. బాధితురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కలిదిండి(కై కలూరు): ప్రమాదవశాత్తూ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మృతి చెందిన ఘటన కలిదిండి మండలం పోతుమర్రులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొలుసు రంగారావు (47) విద్యుత్‌ స్తంభంపై పనిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మొదటి భార్య మరణించడంతో రంగారావు శ్రీదేవి అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా ఒక పాప ఉంది మొదటి భార్య సంతానంలో ముగ్గురికి ఇంకా వివాహాలు కాలేదు. రంగారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని రెండో భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement