వరలక్ష్మీ నమోస్తుతే.. వరలక్ష్మీ పాహిమాం.. స్మరణలు మార్మోగాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవార్లు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. భీమవరంలో మావుళ్లమ్మవారిని నాలుగు లక్షల గాజులతో విశేషంగా అలంకరించారు. సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఏలూరు పత్తేబాదలోని కనకదుర్గమ్మను అరిసెలతో అలంకరించారు. దెందులూరు మండలం గాలాయగూడెంలోని అచ్చమ్మ పేరంటాలమ్మ ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించారు.
–ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/దెందులూరు/
భీమవరం (ప్రకాశంచౌక్)/


