అడవి పులికింత | - | Sakshi
Sakshi News home page

అడవి పులికింత

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

పులుల జీవనశైలి, సంతానోత్పత్తి

బుట్టాయగూడెం: పెరుగుతున్న పులుల గాండ్రింపులతో అడవి తల్లి పులకిస్తోంది. నడకలో రాజసం, వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతుండటం జీవ వైవిధ్యానికి శుభపరిణామం. ప్రభుత్వాలు తీసుకుంటున్న సంరక్షణా చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వల్ల పులుల సంతతి వృద్ధి చెందుతోంది. నల్లమలతో పాటు ఏలూరు జిల్లాలోని పాపికొండలు అభయారణ్యంలో పులుల కదలికలు గణనీయంగా పెరిగాయి.

విస్తరించిన అభయారణ్యం..

ట్రాప్‌ కెమెరాలకు చిక్కిన జాడలు

ఏలూరు, అల్లూరి, భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లోని పాపికొండల అభయారణ్యం మొదట్లో 590 హెక్టార్ల పరిధిలో మాత్రమే ఉండేది. 2008లో దీనిని వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించారు. ఆ తర్వాత దీనిని జాతీయ పార్క్‌గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం విస్తీర్ణాన్ని 1,12,500 హెక్టార్లకు (10,12,86 చ.కి.మీ) పెంచింది. ఈ ప్రాంతంలో 2009–10 కాలంలో పులుల అడుగుజాడలు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాటి గాండ్రింపులు నమోదయ్యాయి. బుట్టాయగూడెం మండలం ఇనుమూరు, చింతలగూడెం, అంతర్వేదిగూడెం, అటవీ ప్రాంతంలో పులుల అడుగులను ఫా రెస్టు అధికారులు గుర్తించారు. 2022 గణనలో ఇ క్కడి ట్రాప్‌ కెమెరాలకు పులుల చిత్రాలు చిక్కాయి. ప్రస్తుతం ఈ అభయారణ్యంలో నాలుగుకు పైగా పెద్ద పులులు, ఐదుకు పైగా చిరుత పులులు ఉన్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2026 జనవరిలో నిర్వహించిన గణన వివరాలను అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా వెల్లడించే అవకాశముంది.

పులుల సంరక్షణ అందరి బాధ్యత

మానవుని దురాశ, అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల పులుల మనుగడ ప్రమాదంలో పడుతోందని వరల్డ్‌ వైడ్‌లైఫ్‌ గణాంకాలు చెబుతున్నాయి. పులుల సంరక్షణపై అవగాహన పెంచేందుకు 2010లో ర ష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ టైగర్‌ సమ్మిట్‌ నిర్ణయం మేరకు ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి పులులను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత.

జీవ వైవిధ్యం.. పులులే ఆధారం

పాపికొండల అభయారణ్యంలో పులి గాండ్రింపులు

పెరుగుతున్న పులుల సంఖ్య

అధికారుల చర్యలు, ప్రజల్లో చైతన్యంతో స్వేచ్ఛగా సంచారం

పులి సంరక్షణ అందరి బాధ్యత అంటున్న అటవీ అధికారులు

రేపు అంతర్జాతీయ పులుల దినోత్సవం

స్వభావం.. జీవనకాలం : పులులు సాధారణంగా ఒంటరిగా జీవిస్తాయి. వీటి జీవితకాలం 18 నుంచి 20 ఏళ్లు. ఇవి రోజుకు దాదాపు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

టెరిటరీ (సంచార పరిధి): ఆడ పులి తన నివాస స్థావరంగా 20 చదరపు కిలోమీటర్ల పరిధిని, మగ పులి 60 నుంచి 100 చదరపు కిలోమీటర్ల పరిధిని ఎంచుకుంటాయి. చెట్ల మొదళ్లపై గోళ్లతో గీరి, మూత్రం ద్వారా తమ సరిహద్దులను గుర్తుంచుకుంటాయి.

వేట : పులి ఒకసారి వేటాడితే మళ్లీ వారం రోజుల వరకు వేట జోలికి వెళ్లదు.

సంతానోత్పత్తి : నవంబర్‌–ఏప్రిల్‌ మధ్య కాలం పులుల పునరుత్పత్తికి అనుకూలం. గర్భధారణ సమయం 93 నుంచి 113 రోజులు (సుమారు 16 వారాలు). ఆడపులి ఒకేసారి 2 నుంచి 3 కూనలకు జన్మనిస్తుంది. పులి పిల్లలు 3 నుంచి 4 ఏళ్ల వరకు తల్లి వద్దే వేట, ఈత నేర్చుకుంటాయి. ఆ తర్వాత మగ పులులు తల్లి నుంచి వేరుపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement