వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన వచ్చేనెల 5న దేవరపల్లి రాక

ద్వారకాతిరుమల: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని వచ్చేనెల 5న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు సోమవారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ హోం మంత్రి తానేటి వనిత, వైఎస్సార్‌సీపీ ఏ లూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, తెల్లం బాలరాజు, పార్టీ ఏలూరు ఇన్‌చార్జి మా మిళ్లపల్లి జయప్రకాష్‌, మాజీ ఏఎంసీ ౖచైర్మన్‌ గన్నమని జనార్దనరావు తదితరులు దేవరపల్లిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే స్థానిక కరుటూరి ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో హెలీప్యాడ్‌ ఏర్పాటుకు స్థలాన్ని, పొ గాకు వేలం కేంద్రంలో రైతులతో జగనన్న ని ర్వహించనున్న ముఖాముఖీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ శ్రేణులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండలానికి చెందిన పార్టీ నేతలు పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్‌, బొండాడ వెంకన్నబాబు, చెలికాని ప్రవీణ్‌, బిరుదుగడ్డ చల్లారావు, దాసరి రాంబాబు, జంగా వెంకట కృష్ణారెడ్డి, భోగరాజు సాయికృష్ణ, బిరుదుగడ్డ బజారయ్య, మానుకొండ సు బ్బారావు, దాకారపు బంగారమ్మ, అగ్గియ్య, మల్లిపూడి నాగమణి, దాసరి ఏసురత్నం, దొప్పసాని రాంబాబు, షేక్‌ బాష తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement