పెరుగుతున్న గోదావరి | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న గోదావరి

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

పెరుగుతున్న గోదావరి మైదాన ప్రాంతానికి పెద్దపులి పోలవరం డీఎస్పీగా జయకృష్ణ ‘ఏరువాక’ శాస్త్రవేత్త ఫణికుమార్‌కు అవార్డు 9న క్షీరారామంలో జ్వలాభిషేకం

పోలవరం రూరల్‌ : గోదావరి వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో ఉప నదుల నీటితో పాటు శబరి నీరు కూడా నదిలోకి చేరడంతో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 28.650 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 1.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్ర వాహం పెరుగుతూ ఇసుక తిన్నెలను ముంచుకుంటూ ఉధృతంగా ప్రవహిస్తోంది.

పోలవరం రూరల్‌: పాపికొండల అభయారణ్య ప్రాంతం నుంచి పెద్దపులి మైదాన ప్రాంతానికి చేరుకుంది. కొన్ని రోజులుగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని శివగిరి, కొరుటూరు అటవీ ప్రాంతంలో సంచరించింది. ఆదివారం పోలవరం మండలంలోని ఇటికిలకోట, పేడ్రా ల, కుంకాల గ్రామాల మీదుగా ఎల్‌ఎన్‌డీపేట గ్రామం చేరుకుంది. గ్రామ శివారులోని చెరువు గట్టు వద్ద పెద్ద పులి పాదముద్రలను సో మవారం గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. రేంజర్‌ ఎస్‌కే వలీ సిబ్బందితో కలిసి వెళ్లి పులి సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. పులి పాదముద్రలను గుర్తించినట్టు ఆయన చెప్పారు. అక్కడి నుంచి గోపాలపురం మండలంలోని సాగి పాడు, నందిగూడెం, గుడ్డిగూడెం ప్రాంతాలకు వెళ్లినట్లు పులికి అమర్చిన రేడియో సిగ్నల్స్‌ ద్వారా గుర్తించినట్టు రేంజర్‌ తెలిపారు.

పోలవరం రూరల్‌: పోలవరం డీఎస్పీగా కె.జయకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇటీవల గ్రూప్‌–1 అధికారి గా ఎంపికై న తర్వాత తొలిసారిగా పోలవరం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల క్రితం ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం ఇక్కడ డీఎస్పీలుగా ఇన్‌చార్జిలు వ్యవహరించారు. డీఎస్పీ జయకృష్ణ బాద్యతలు స్వీకరించడంతో పోలీసు సేవలు మరింత అందుబాటులోకి చేరుకున్నాయి.

దెందులూరు: ఏరువాక కేంద్రంలో విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్‌ ఫణికుమార్‌కు ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్త అవార్డు లభించింది. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (బాపట్ల) వ్యవసాయ కళాశాలలో గవర్నర్‌ జస్టిస్‌ మహమ్మద్‌ నజీర్‌ ఆయనకు అ వార్డు అందించి సత్కరించారు. ఏరువాక కేంద్రం ఉద్యోగులు, వ్యవసాయశాఖ అధికారులు ఫణికుమార్ను అభినందించారు.

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో లోక కల్యాణార్థం వరుణ జ్వలాభిషేకం చేయనున్నట్టు ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. వచ్చేనెల 9న ఉదయం 9 గంటల నుంచి 108 కలశాలతో జ్వలాభిషేకం నిర్వహిస్తామన్నారు. 10న ఉదయం 6 గంటల నుంచి 16 మంది రుత్వికులతో అభిషేకాలు, వరుణ జ్వాలాభిషేక మంత్ర పుష్పం ఏర్పాటుచేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement