జిల్లాలో వైద్యుల కొరత ఇలా..
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా లోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో పేద, మధ్యతరగతి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. స్థానిక జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో అన్నిరకాల స్పెషలిస్ట్ వై ద్యులను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, ప్ర భుత్వ నిర్లక్ష్యం కారణంగా పరిస్థితులు రోజురోజు కూ దిగజారుతున్నాయి. అత్యవసర, మెరుగైన వై ద్యం కోసం ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి, అప్పులపాలవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ జ్వరాలు, ప్రసవాలు తప్ప ఇతర వ్యాధులకు సరైన చికిత్స అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
8 ఆసుపత్రులు.. 21 మంది వైద్యుల ఖాళీలు
● జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి, 4 ఏరియా ఆసుపత్రులు, 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు కలిపి మొత్తం 8 ప్రధాన ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. వీటిలో మొత్తం 21 మంది వైద్యుల కొరత ఉంది.
● సాధారణ ఎంబీబీఎస్ వైద్యుల నుంచి జనరల్ సర్జన్లు, అనస్థీషియా (మత్తు) నిపుణులు, గైనకాలజిస్టుల వరకు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
● ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు పైచదువుల కోసమో లేదా సొంత ఆస్పత్రుల ఏర్పాటు కోసమో వెళ్లిపోతుంటే, వారి స్థానంలో కొత్తవారిని నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది.
● ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుదామన్నా.. స్థానికంగా అన్ని రకాల వైద్య సేవలు అందించే మల్టీస్పెషాలిటీ నెట్‌వర్క్ ఆస్పత్రులు లేవు. దీంతో ఒక్కో చికిత్స కోసం వేర్వేరు పట్టణాలకు తి రగాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
అందుబాటులో లేని స్కానింగ్ సేవలు
జిల్లాలోని ఏ ప్రభుత్వాసుపత్రిలోనూ ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి ఆధునిక, ఖరీదైన పరికరాలు అందుబాటులో లేవు. దీంతో పేదలు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు స్కానింగ్ అవసరమైతే, ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి రూ.3,000 నుంచి రూ.6,000 వర కు సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభు త్వం సకాలంలో స్పందించి ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
భీమవరం ఏరియా ఆస్రత్రి
ఆస్పత్రి వైద్యుల కొరత
తణుకు జిల్లా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 2, మత్తు డాక్టర్ 1,
రేడియాలజిస్ట్ 1, డెర్మటాలజిస్ట్ 1, జనరల్ మెడిసన్
1, పీఎం 1 (మొత్తం 7)
భీమవరం ఏరియా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 1, జనరల్ మెడిసన్ 2
(మొత్తం 3)
తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 1, పిడియాట్రిక్స్ 1,
రేడియాలజిస్ట్ 1 (మొత్తం 3)
నరసాపురం ఏరియా ఆస్పత్రి జనరల్ ఎంబీబీఎస్ 1, గైనకాలజిస్ట్ 1 (మొత్తం 2)
ఆచంట సీహెచ్‌సీ జనరల్ సర్జరీ 1, జనరల్ మెడిసన్ 1, డెంటిస్ట్ 1
మత్తు డాక్టర్ 1 (మొత్తం 4)
పెనుగొండ సీహెచ్‌సీ గైనకాలజిస్ట్ 1
ఆకివీడు సీహెచ్‌సీ జనరల్ సర్జరీ 1
వైద్యం.. పూజ్యం
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత
పూర్తిస్థాయిలో అందని సేవలు
జనరల్ మెడిసిన్, గైనకాలజిస్టులు లేరు
ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్‌లు లేవు
అత్యవసర వైద్యానికి ప్రైవేట్ ఆస్పత్రులే దిక్కు
పట్టించుకోని కూటమి ప్రభుత్వం


