దెందులూరు: జాతీయ రహదారిపై కొవ్వలి వంతెన సమీపంలో బుధవారం ఆగి ఉన్న టిప్పర్ లారీని గుండుగొలను నుంచి ఏలూరు వైపు వెళుతున్న లారీ ఢీకొనడంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంతోషి బగాడి అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ టైరు రిపేరు చేస్తున్న డ్రైవర్ ముప్పిడి సతీష్ పైకి లారీ ఎక్కడంతో అతను కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో టిప్పర్ డ్రైవర్ కంపెల్లి రవీంద్ర కుమార్, క్లీనర్ అంబ్రెల్లాకు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


