జాతీయ లోక్‌ అదాలత్‌లో 7,910 కేసుల రాజీ | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌లో 7,910 కేసుల రాజీ

Jul 13 2026 1:10 AM | Updated on Jul 13 2026 1:10 AM

జాతీయ లోక్‌ అదాలత్‌లో 7,910 కేసుల రాజీ

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 7,910 కేసు లను రాజీ చేసినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి తెలిపారు. ఏలూరులో 10, భీమవరంలో 5, కొవ్వూరులో 2, నరసాపురంలో 4, తణుకులో 5, తాడేపల్లిగూడెంలో 3, పాలకొల్లులో 2, నిడదవోలులో 1, జంగారెడ్డిగూడెంలో 2, చింతలపూడిలో 1, భీమడోలులో 1 బెంచీలు ఏర్పాటుచేశామన్నారు. మొత్తంగా 7,857 పెండింగ్‌, 53 ప్రీ లిటిగేషన్‌ కేసులను రాజీ చేసినట్టు చెప్పారు. పెండింగ్‌ కేసుల్లో 7,454 క్రిమినల్‌, 185 మోటార్‌ వాహన ప్రమాద బీమా, 215 సివిల్‌ కేసులు ఉన్నాయన్నారు.

కోర్టుల వారీగా..

ఏలూరులో 2,328, భీమవరంలో 478,చింతలపూడిలో 404, జంగారెడ్డిగూడెంలో 906, కొవ్వూరులో 756, నరసాపురంలో 335, పాలకొల్లులో 448, తాడేపల్లిగూడెంలో 711, తణుకులో 1,197, నిడదవోలులో 228, భీమడోలులో 66 కేసులను రాజీచేశామన్నారు. లోక్‌అదాలత్‌ విజయవంతానికి సహకరించిన వారందరికీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ కమ్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కమ్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement