కై కలూరు: సాగు నీరు లేక వరి నారు ఎండిపోతున్న వైనంపై రైతుల ఇబ్బందులను వివరిస్తూ ‘తడవని మడి.. అన్నదాత అలజడి’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం కథనం వెలువడిన విషయం పాఠకులకు విధితమే. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించి నీటిని శివారు ప్రాంతాలకు విడుదల చేయాలని ఇరిగేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఇరిగేషన్ డీఈఈ ఎం.శిరిష కై కలూరు నియోజకవర్గానికి నీటిని చేరవేసే పోల్‌రాజ్, క్వాంప్ బెల్ కాల్వలకు ఒక్కోదానికి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చే యించారు.
పాలకొల్లు సెంట్రల్: నరసాపురం నుంచి బెంగళూరుకు వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం ప్రారంభించారు. రైలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:45 గంటలకు బెంగళూరు చేరుతుంది. ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:50 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.


