రొయ్యల ధరల్లో నిలకడలేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రొయ్యలు 80 కౌంట్ నుంచి కౌంట్ తగ్గే స్థితిలో గతంలో కేవలం రూ.10 వ్యత్యాసం ఉండగా నేడు రూ.30 వరకు ఉంటుంది. దీంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. రొయ్యల ధరలు 15 రోజులపాటు ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– గాదిరాజు సుబ్బరాజు, ఆక్వా ఫ్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి
ప్రస్తుతం రొయ్యలకు వైట్‌గట్ వంటి వ్యాధులు సోకాయి. ఫీడ్, మందుల ధరలు పెరిగిపోవడంతో పెట్టుబడులు పెట్టలేక సతమతమవుతున్నారు. తెగుళ్ల కారణంగా అనేక చెరువులు ఖాళీగానే దర్శన మిస్తున్నాయి. ఫీడ్ ధరలు తగ్గించడానికి, సబ్సిడీ విద్యుత్ రైతులందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, తోలేరు
ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆక్వా జోన్స్ ప్రమేయం లేకుండా సబ్సిడీ విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించి నెలలు గడిచిపోతున్నా అమలు కావడం లేదు. ఫీడ్ ధరలు రూ.4 తగ్గించినట్లు ప్రకటించినా కేవలం రూ.2 మాత్రమే తగ్గించాయి. ముడిసరుకు ధరలు తగ్గించేలా కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవాలి.
– బొల్లెంపల్లి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, అండలూరు


