భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కేరళ రాష్ట్ర డీజీపీ రావాడ ఆజాద్ చంద్ర శేఖర్, సరిత దంపతులు గురువారం దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారికి పూజలు చేసి డీజీపీ దంపతలకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి శేషవస్త్రం, ప్రసాదం ఫొటో అందజేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
బుట్టాయగూడెం: బూసరాజుపల్లి సమీపంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన సంక్షేమ డిగ్రీ విద్యార్థుల వసతిగృహాన్ని జిల్లా పశు సంవర్థకశాఖ జేడీ రామ్మోహన్‌రావు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాలను, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్వహణ, ఆర్‌ఓ ప్లాంట్లపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీకి వచ్చా నని, వివరాల నివేదికను ఆమెకు అందిస్తానన్నారు. డిగ్రీ కళాశాల విద్యార్థుల వసతిగృహం ప్రస్తుతం ఒక గదిలోనే ఏర్పాటుచేశారని, ఆర్‌ఓ ప్లాంట్ కోసం మరో గది లేదని వార్డెన్ టి.వెంకటేశ్వరరావు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎంఈఓలు తెల్లం బాబూరావు, సీహెచ్ నరేంద్రరాయ్, ఇన్‌చార్జి ఎంపీడీఓ ఈఎస్‌ఎస్ శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కె. గంగరాజు, ఎంఆర్‌కే పారేపల్లి బాపిరాజు ఉన్నారు.


