లాభాలు చేపట్టేలా.. | - | Sakshi
Sakshi News home page

లాభాలు చేపట్టేలా..

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

నీలివిప్లవానికి ఆద్యులు అవగాహన కలిగిస్తున్నాం

జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు

నేడు జాతీయ చేపల రైతుల దినోత్సవం

మత్స్యశాస్తవేత్తలు హీరాలాల్‌ చౌదరీ, అలీకున్‌హీ కృషి వల్ల ఈ రోజు హేచరీల్లో చేప పిల్లల ఉత్పత్తి అధికంగా ఉంది. ఎంఎన్‌ఆర్‌ హేచరీ ద్వారా 10 ఏళ్లుగా నాణ్యమైన ఫంగస్‌, కట్లా, రూప్‌చంద్‌, శీలావతి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాను. నీలివిప్లవానికి ఆధ్యులైన శాస్త్రవేత్తలను స్మరించుకోవడం ఉత్తమం.

– ముంగర నరసింహారావు,

ఎంఎన్‌ఆర్‌ హేచరీస్‌ అధినేత, ఆకివీడు

జాతీయ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా కైకలూరు మత్స్యశాఖ కార్యాలయంలో ఆక్వా రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆక్వారంగం కొత్త పుంతలు తొక్కడానికి శాస్త్రవేత్తల కృషి కారణం.

– సీహెచ్‌ గణపతి,

మత్స్యశాఖ అభివృద్థి అధికారి, కై కలూరు

కై కలూరు: రాష్ట్రం ఆక్వారంగానికి మణిహారంగా నిలిస్తోంది. సముద్ర తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలు ఆక్వా ఉత్పత్తులలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ఏపీలో ఆక్వాసాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉండగా ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. దేశ రొయ్యల ఉత్పత్తుల్లో రాష్ట్ర వాటా 73 శాతంగా ఉంది. ఇలా మత్స్యరంగం అభివృద్ధి చెంది సిరులు కురిపించే అక్షయ పాత్రగా మారడానికి ఇద్దరు మత్స్య శాస్తవేత్తలు డాక్టర్‌ హీరాలాల్‌ చౌదరీ, డాక్టర్‌ కొల్లియిల్‌ హమీద్‌ అలీకున్‌ హీల పాత్ర కీలకంగా ఉంది. వీరిని స్మరించుకుంటూ ఏటా జూలై 10న జాతీయ చేపల రైతుల దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లాలోని కై కలూరు మత్స్య శాఖ కార్యాలయలో శుక్రవారం ఆక్వా రైతులకు అవగాహన కల్పించనున్నారు.

ప్రేరిత ప్రజననం : చేపల్లో ప్రేరిత ప్రజననం (ఇన్‌డ్యూసుడ్‌ బ్రీడింగ్‌) అనేది హార్మోన్ల ఇంజెక్షన్ల ద్వారా కృత్రిమంగా చేపలు గుడ్లు పెట్టేలా ప్రేరేపించే ఒక ఆధునిక సాంకేతిక పద్ధతి. సహజసిద్ధంగా నదుల్లో మాత్రమే సంతానోత్పత్తి చేసే కొన్ని రకాల చేపలు (బొచ్చె, కట్ల, శీలవతి, రోహు, మృగాల వంటి మేజర్‌ కార్ప్స్‌) చెరువు నిలువ నీటిలో గుడ్లు పెట్టవు. ఈ సమస్యను అధిగమించడానికి 1957 జూలై 10న మత్స్యశాస్తవేత్తలు డాక్టర్‌ హీరాలాల్‌ చౌదరీ, డాక్టర్‌ కొల్లియిల్‌ హమీద్‌ అలీకున్‌హీలు విజయం సాధించారు. ఈ పద్ధతి ద్వారా మత్స్యకారులు తమకు అవసరమైనప్పుడు కృత్రిమంగా చేప పిల్లలను ఉత్పత్తి చేసుకునే అవకాశం కలిగింది.

చేప విత్తన మిగులు రాష్ట్రంగా ఏపీ

ప్రస్తుతం చేపల విత్తనాల మిగులు రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాష్ట్రంలో 429 రొయ్యల హేచరీస్‌ ద్వా రా ఏడాదికి 60,000 మిలియన్ల పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం 106 ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో రో జూ 5,891 టన్నుల ఎగుమతులు జరుగుతు న్నాయి. అలాగే రాష్ట్రంలో 42 మేతల ఫ్యాక్టరీల నుంచి రోజూ సుమారు 9,750 టన్నుల మేతలు ఉ త్పత్తి చేస్తున్నారు. ఇక కొల్లేరు ప్రాంతంలో ఆక్వా ప రిశ్రమ శరవేగంగా విస్తరించింది. ఈ ప్రాంతంలో చిత్తడి నేలల చేపల ఎదుగుదలలో కీలక పాత్ర పో షిస్తుంది. ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆక్వా పరిశ్రమ లక్షల కుటుంబాలను ఆదుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement