మా కుటుంబం రెండు త రాలుగా వరి సాగు చేస్తోంది. ఎకరాకు అరకట్ట ఎరువులు ఇస్తామంటున్నారు. ఇంతవరకూ మా కాలువలకు నీరు రాలేదు. ఆక్వా రైతులకు ఒక న్యాయం, వరి రైతులకు మరో న్యాయంగా అధికారుల ప్రవర్తన ఉంది. రైతుల గోడు పట్టించుకోరా?
– చేబోయిన రామకృష్ణ, రైతు, రాచపట్నం
అదునులో చేస్తేనే పంట చేతికొస్తోంది. వెదజల్లు విధానంలో నారు వచ్చి 15 రోజులు దాటింది. నీరు లేక పలుచోట్ల రంగు మారి నారు చచ్చిపోతోంది. మరోవైపు రైతులను ఆదుకుంటున్నామని నేతలు ప్రకటనలు చేస్తున్నారు. మా కాలువలకు నీటిని తక్షణమే విడుదల చేయాలి.
– బోడావులు శ్రీనివాసరావు, రైతు, రాచపట్నం
కైకలూరు నియోజకవర్గంలో పోల్‌రాజ్, క్వాంప్‌బెల్ కాలువల ద్వారా నీరు విడుదలవుతోంది. ఇటీవల తా గునీటి చెరువులకు విడుదల చేశాం. ప్రస్తుతం వెదజల్లే పద్ధతిలో రైతులు నారు వేశారు. పోల్‌రాజ్ కాలువకు 100 క్యూసెక్కుల నీటిని గుడ్లవల్లేరు లాకుల వద్ద విడుదల చేశారు. క్యాంప్‌బెల్ కాలువకు 100 క్యూసెక్కులను త్వరలో విడుదల చేయనున్నారు.
– ఎం.శిరీషా, ఇరిగేషన్ డీఈఈ, కై కలూరు


