పెరిగిన గోదావరి ప్రవాహం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన గోదావరి ప్రవాహం

Jul 9 2026 6:23 AM | Updated on Jul 9 2026 6:23 AM

పోలవరం రూరల్‌: ఈ ఏడాది తొలిసారిగా గోదావరి వరద నీరు ఉభయగోదావరి జిల్లాల మధ్య లంక ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తోంది. మహారాష్ట్ర, నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నీరు నదిలోకి చేరడంతో వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 27.370 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 97 వేల క్యూసెక్కుల నీరు దిగువకు చేరు తోంది. దీంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. స్పిల్‌వే నుంచి నీరు దిగువకు చేరుతుండటంతో స్పిల్‌ చానల్‌ ప్రాంతంలో మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో నిర్మించిన తాత్కాలిక రోడ్డు మార్గం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రోడ్డు అడుగుభాగంలో వేసిన తూరలు చెల్లాచెదురయ్యాయి. దిగువన వరద ప్రవాహం పెరుగుతూ ఇసుక తిన్నెలు ముంచుకుంటూ ప్రవహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement