పాలకోడేరు: మండలంలో విద్యుత్ లైన్‌మెన్ల కొరత తీవ్రంగా ఉంది. 14 గ్రామాలకు కుముదవల్లి, వేండ్ర, గొరగనమూడి గ్రామాలకు విద్యుత్ లైన్‌మెన్‌లు లేరు. విస్సాకోడేరు గ్రామానికి ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో పనిభారం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు లైన్ ఇన్సెపెక్టర్లు ఉండాలి. ప్రస్తుతం వారు మెడికల్ లీవ్‌పై వెళ్లిపోవడంతో పరిస్థితి దిగజారిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మొత్తం మండలానికి ఇంకా 6 మంది లైన్‌మెన్ల కొరత ఉందని, ఈ కొరతను వెంటనే తీర్చకపోతే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే సిబ్బంది లేక గంటల తరబడి పరిష్కారం కావడం లేదని, దీంతో రైతులు, గృహ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కొరతను అధిగమించాలంటే జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇద్దరు లైన్‌మెన్లు ఉన్నచోట నుంచి అసలు లేని గ్రామాలకు భర్తీ చేస్తే కొంతమేర ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు.


