రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సంక్షేమ సంఘాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సంక్షేమ సంఘాలు

Jul 9 2026 6:23 AM | Updated on Jul 9 2026 6:23 AM

భీమవరం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో రెడ్డి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడి భీమారెడ్డి చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భీమవరం, ఉండి, కై కలూరు నియోజకవర్గాల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో సంఘాల ఏర్పాటు ద్వారా సభ్యుల సంక్షేమం, ఐక్యతకు అవకాశం ఉంటుందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వేణుగోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ జిల్లాకు అనుబంధంగా 17 నియోజకవర్గస్థాయి కమిటీలు నియమించామన్నారు. ముఖ్య అతిథులుగా ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌ అధినేతలు డాక్టర్‌ ఎస్‌ఎల్‌ఎన్‌ ప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌ రెడ్డి హాజరుకాగా జిల్లా రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల విజయ లక్ష్మణ్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కర్రా రామచంద్రారెడ్డి, తమనంపూడి వెంకటరెడ్డి, మేడపాటి చిరంజీవిరెడ్డి, కొవ్వూరి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement