పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

Jul 9 2026 6:23 AM | Updated on Jul 9 2026 6:23 AM

పెంటపాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచి, తల్లీబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేయాలని డీఎంహెచ్‌వో ఎం.రవిబాబు పేర్కొన్నారు. బుధవారం ముదునూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో జరుగుతున్న పలు ఆరోగ్యకార్యక్రమాలపై సమీక్షించారు. రికార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఫార్మసీ, లేబర్‌రూం, డెలివరీ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పూజిత, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు మంచి వైద్యం అందించడంతో పాటు, డెలివరీ రూంలో ఉన్న చిన్నపాటి లోపాలు సవరించుకొని ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. గర్భిణులకు మంచి భరోసా, నమ్మకమైన ప్రచారం కల్పించాలన్నారు. ఎంపీహెచ్‌ఈవో సీహెచ్‌ సత్యనారాయణ, పీహెచ్‌ఎన్‌ అనంతలక్ష్మి, హెచ్‌వీ సత్యవతి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement