నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ మార్పు | - | Sakshi
Sakshi News home page

నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ మార్పు

Jul 8 2026 1:02 AM | Updated on Jul 8 2026 1:02 AM

నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ మార్పు ‘తల్లికి వందనం’ పథకానికిబ్యాంకు ఖాతాలను తెరవాలి

ఇన్‌చార్జి డైరెక్టర్‌గా వైస్‌ ఛాన్సలర్‌ లక్ష్మీనారాయణరావు బాధ్యతల స్వీకరణ

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఆర్జీయూకేటీ వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగు నెలలుగా ఇన్‌చార్జి డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజును అకస్మాత్తుగా మార్చి ఆయన స్థానంలో వైస్‌ఛాన్సలర్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడంపై ట్రిపుల్‌ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గోపాలరాజు మార్చి 12న ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరో నాలుగు రోజుల్లో నాలుగు నెలలు పూర్తికావస్తుండగా డైరెక్టర్‌ పదవి నుంచి పక్కకు తప్పుకోవడం గమనార్హం. దీంతో కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకు వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య మద్దాల లక్ష్మీనారాయణరావు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన మాట్లాడుతూ ట్రిపుల్‌ఐటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌, నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఏఓ బీ లక్ష్మణరావు, డీన్‌ అకడమిక్స్‌ సాదు చిరంజీవి పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన షెడ్యూల్‌ కులాలకు చెందిన విద్యార్థులు ‘తల్లికి వందనం 2026–2027’ పథకం లబ్ధి పొందుటకు తప్పనిసరిగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా/ యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా/ పోస్టాఫీస్‌ నందు బ్యాంక్‌ ఖాతా తెరవాలని, ఎన్‌పీసీఐకి లింక్‌ చేయించుకోవాలని ఉప సంచాలకులు, జిల్లా సాంఘీక సంక్షేమ, సాధికారిత అధికారి వై.విశ్వమోహన్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీలోగా ఖాతా ప్రారంభించాలన్నారు. వివరాలకు కె.వీరబాబు, డీపీఎంయు 95022 28533 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement