ఆలోచింపజేసిన నాటికలు
ఏలూరులో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటిక పోటీలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. 8లో u
జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టి మోసపోయిన బాధితులు సోమవారం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితను మర్యాదపూర్వకంగా కలిసి ఆవేదనను విన్నవించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, దర్యాప్తులో భాగంగా పోలీసులు తమ వద్ద ఉన్న బంగారు తాకట్టు ఆభరణాల ఒరిజినల్ రసీదులను తీసుకుంటున్నారని, భవిష్యత్తులో ఒరిజినల్ రసీదులు లేకపోతే రేపు బ్యాంకు నుంచి నగలు విడిపించుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని తమ అనుమానాలను ఏఎస్పీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. కేసును త్వరితగతిన ఛేదించడానికి, దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే ఒరిజినల్ రసీదులను సేకరిస్తున్నామని, ఇవి కేసులో చాలా కీలకమని స్పష్టం చేశారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రసీదులు తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికీ పోలీసుల తరఫున గ్యారెంటీగా అక్‌నాలెడ్జ్‌మెంట్ పత్రం ఇస్తామని చెప్పారు. తామే స్వయంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ బంగారం మోసంపై దర్యాప్తు అత్యంత పారదర్శకంగా సాగుతుందని, బాధితులందరికీ పోలీస్ వ్యవస్థ అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తుందని ఏఎస్పీ భరోసా ఇచ్చారు.
భీమవరం: గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన ఉపాధ్యాయులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజినల్ స్థాయిలో ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.


