● కన్నకొడుకే కర్కశకుడిగా మారి.. | - | Sakshi
Sakshi News home page

● కన్నకొడుకే కర్కశకుడిగా మారి..

Jul 7 2026 1:01 AM | Updated on Jul 7 2026 1:01 AM

● కన్నకొడుకే కర్కశకుడిగా మారి..

కన్నకొడుకే కర్కశకుడిగా మారి నవమాసాలు మోసి పెంచిన తల్లిని వేధిస్తున్న ఘటన ఇది. తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన బుగత నీలమ్మ (95) అనే వృద్ధురాలి భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించారు. అప్పటి నుంచి ఆమె ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ డబ్బులతోనే జీవనం సాగిస్తోంది. అయితే, ప్రతి నెలా పింఛన్‌ డబ్బులు రాగానే ఆమె కుమారుడు బుగత రమేష్‌ తల్లి వద్దకు వచ్చి, ఆమెను తీవ్రంగా కొట్టి ఆ డబ్బులను బలవంతంగా లాక్కెళుతున్నాడు. కొడుకు పెడుతున్న బాధలను భరించలేక, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆ వృద్ధురాలు సహాయకుల సాయంతో వచ్చి ఫిర్యాదు చేసింది. కన్నకొడుకు వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్విని ఆమె కన్నీటితో వేడుకుంది.

– ఫొటో: సాక్షిఫొటోగ్రాఫర్‌/ ఏలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement