అదృశ్యమైన తల్లి, పిల్లల అప్పగింత | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన తల్లి, పిల్లల అప్పగింత

Jul 6 2026 12:58 AM | Updated on Jul 6 2026 12:58 AM

కామవరపుకోట: ఈ నెల 29న భర్తతో గొడవపడి పిల్లలతో సహా అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీని తడికలపూడి పోలీసులు గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై వల్లి పద్మ వివరాల ప్రకారం మండలంలో తడికలపూడి గ్రామానికి చెందిన బాకీ దుర్గ భర్తతో గొడవపడి జూన్‌ 29వ తేదీన ఇద్దరు కుమారులను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవడంతో తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఈనెల 2న తడికలపూడి పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆమె ఆచూకీ గుర్తించి, శనివారం రాత్రి తడికలపూడి పోలీస్‌ స్టేషన్‌కి తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఆమెను, ఆమె కుమారులను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement