భీమవరం: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలుచేయాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, న్యాయవాదులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భీమవరంలో న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఐఎఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ న్యాయవాదులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ, పర్యవేక్షణ చట్టాలను వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులపై పెరిగిపోతున్న దాడులను నిలువరించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల స్టైఫండ్ వెంటనే అమలు చేయాలని, వైద్యం, బీమా సదుపాయాలు అందించాలని, అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చెల్లబోయిన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బడుగు అశోక్‌బాబు, ఐఎఎల్ నాయకులు మల్లుల శ్రీనివాసరావు, వైవీ ఆనంద్, మోకా రాముడు, బోకూరి విజయరాజు, సుబ్బయ్య, ఇంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


