జంగారెడ్డిగూడెం: వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా సురక్షితమైన మంచినీరు అందించాలని, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు అధికారులను ఆదేశించారు. జంగారెడ్డిగూడెం డీఎల్‌డీవో కార్యాలయం వద్ద శుక్రవారం పది మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులు, విస్తరణ అధికారులు, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం, పంచాయతీ రికార్డుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరై పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం, పంచాయతీ పరిధిలో పన్నుల వసూళ్ల ప్రగతి, న్యాయస్థానం కేసులకు సంబంధించిన నివేదికలు, మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణ, వర్షాకాలం దృష్ట్యా రక్షిత మంచి నీటి సరఫరా ట్యాంకులను శుభ్రపరచడం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కర్మయోగి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్ కోర్సుల పూర్తి వంటి పలు కీలక అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. సమావేశంలో డీఎల్‌డీవో ఎం.రాజు, డీఎల్‌పీవో ఏవీఎస్ రాయన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు


