● భూమి కనిపిస్తే యథేచ్ఛగా కబ్జా
● చినవెంకన్న భూమినీ వదలని నేతలు
● ఏలూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నా
ఏలూరు టౌన్: ద్వారకాతిరుమల దేవస్థానం భూమికి అన్‌రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సృష్టించి టీడీపీ నేతలు కబ్జా చేసిన వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు భగ్గుమన్నాయి. దేవుడి భూమికే రక్షణ కరువైందనీ.. రాష్ట్రంలో సామాన్యులకు దిక్కెవరనీ.. టీడీపీ కూటమి నేతలు భూమి కనిపిస్తే కబ్జా చేస్తూ.. ఆఖరికి స్వామివారి భూమిని సైతం కై ంకర్యం చేయటంపై కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ హోమంత్రి తానేటి వనిత, రాష్ట్ర యు వజన అధ్యక్షులు జక్కంపూడి రాజా, రెండు జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు, శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తక్షణమే స్వామివారి భూమి కబ్జాపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలనీ, భూమిని స్వామివారి దేవస్థానానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందించారు.
వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్, రాష్ట్ర మహిళ విభాగం జాయింట్ సెక్రటరీ ఆచంట అనసూయ, తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, ద్వారకాతిరుమల మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బిరుదుగడ్డ చల్లారావు, మాజీ ట్రస్ట్‌బోర్డ్ సభ్యుడు మానుకొండ సుబ్బారావు, నాయకులు తాండ్ర రమేష్, భోగరాజు సాయికృష్ణ, మానుకొండ కన్నయ్య, దాసరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


