అరకమ చెరువు గట్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

అరకమ చెరువు గట్లు ధ్వంసం

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

అరకమ చెరువు గట్లు ధ్వంసం సర్‌ వేగిరపర్చాలి 16.35 లక్షల ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ వీబీజీ రాంజీతో పల్లెలు అభివృద్ధి గ్రూప్‌–2కు ఉచిత శిక్షణ

కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువు గట్లను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. కై కలూరు మండలం పెంచికలమర్రులో పట్టపగలు ఎవరికీ అనుమా నం రాకుండా కూలీలతో ఓ వ్యక్తి చేపల చెరువు గట్లును పటిష్ట పరుస్తున్నాడు. కొల్లేరు ఆపరేషన్‌ సమయంలో అధికారులు ధ్వంసం చేసిన చెరువుల్లోనే సాగు చేస్తున్నాడు. దీనిపై ఇటీవల సాక్షిలో ‘ఆగని అక్రమ గట్లు పర్వం’ శీర్షికన కథనం వెలువడింది. దీనిపై అటవీశాఖ కైక లూరు రేంజర్‌ కె.రామంలింగాచార్యులు స్పందించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని పంపించారు. గట్లును ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా రేంజర్‌ మాట్లాడతూ అభయారణ్యంలో అక్రమ సాగు చేసినా, గట్లు ఏర్పాటు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నూజివీడు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందజేసిన గణన పత్రాలను పూర్తిచేసి త్వరితగతిన బీఎల్‌ఓలకు అందజేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ప్రజలను కోరారు. పట్టణంలోని అజరయ్యపేటలో గురువారం సర్‌ ప్రక్రియ అమలు తీరును ఆమె పరిశీలించారు. పలు గృహాలకు వెళ్లి గణన పత్రాలను అందజేసిందీ లేనిదీ ఆరా తీశారు. ఈనెల 14 వరకు సర్‌ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి బీఎల్‌ఓ తమ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటినీ సందర్శించి గణన పత్రాలు ఓటర్లకు అందజేశారన్నారు. సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కొరపాటి పీరయ్య, తహసీల్దార్‌ షేక్‌ షంషుద్దీన్‌ ఉన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో సర్‌ కార్యక్రమంలో ఇప్పటివరకూ 16,35,754 ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాద్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టర్‌ హాజరయ్యారు. జిల్లాలో 99.49 శాతం పత్రాల పంపిణీ పూర్తయ్యిందని, 8,03,166 ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయ్యిందని చెప్పారు.

ముసునూరు: వీబీజీ రాంజీ పథకం పల్లె సీమల అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర సమా చార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు. గురువారం ముసునూరులో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వితో కలిసి వీబీజీ రాంజీలో ఫీడర్‌ చానల్‌ పనులను ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ఈ పథకం వచ్చిందని ప్రతి కుటుంబానికి 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తామ న్నారు. సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, సహా య కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌, డ్వామా పీడీ కె.వెంకట సుబ్బారావు, జిల్లా ఉద్యాన శాఖా ధికారి కె.షాజానాయక్‌ పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, బీసీ స్టడీ సర్కిల్‌ ఇన్‌చార్జి విశ్వమోహన్‌ రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 15లోపు ఏలూరు బీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 100 మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టయిఫండ్‌ కింద నెలకు రూ.1,500, స్టడీ మెటీరియల్‌ రూ.1,500 చొప్పున ఇస్తామన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 20న శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు సెల్‌ 86861 80018, 90302 11920 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement