విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి నన్నయ విద్యార్థులకు నిట్‌లో పీహెచ్‌డీ సీట్లు

నూజివీడు : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు పట్టుదలతో ముందుకు సాగాలని, అప్పుడే సులువుగా లక్ష్యాన్ని సాధించగలుగుతారని ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీకి వచ్చిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు గురువారం స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌లో ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ జీవితంలో వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు వృథా చేసుకోవద్దని, చక్కగా చదువుకుని దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని, ఏమైనా అర్థం కాకపోతే వెంటనే అడగాలని సూచించారు. క్యాంపస్‌లోనే అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.లక్ష్మణరావు, డీన్‌ అకడమిక్స్‌ సాదు చిరంజీవి, డీఎస్‌డబ్ల్యూఓలు లంకపల్లి రాజేష్‌, దుర్గాభవాని, పీయూసీ ఇన్‌చార్జి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు పీహెచ్‌డీ సీట్లు వచ్చినట్లు ప్రిన్సిపాల్‌ టి.అశోక్‌ గురువారం తెలిపారు. పి.తేజస్విని, జీఆర్‌.సత్యనారాయణకు ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలో తమ విద్యార్థులకు సీట్లు రావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్‌ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగం కోర్సు కో–ఆర్డినేటర్‌ శ్రీరాముడు, అధ్యాపకులు పుత్రయ్య, రమణ, డాక్టర్‌ ప్రశాంతి, రామ్మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement