న్యూస్‌రీల్
ఎగుమతులు పడిపోయాయి
ఒక బస్తా మాత్రమే వస్తున్నాయి
కాపు ఆలస్యం అవుతుంది
సామాన్యుల నెత్తిన గుది‘బండ’
అమెరికా–ఇరాన్ యుద్ధ సెగలు సామాన్యుడి వంటింటిని తాకాయి. గ్యాస్ కొరత ప్రచారాలతో సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. 8లో u
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
ద్వారకాతిరుమల: ఈ ఏడు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు నిమ్మకాయల ఎగుమతులు నిమ్మదించాయి. ప్రతికూల వాతావరణం కారణంగా సకాలంలో చెట్లు కాపు కాయకపోవడం వల్లే నిమ్మకాయలకు కొరత ఏర్పడింది. ఫలితంగా డిమాండ్ ఏర్పడి నిమ్మకాయల ధరలు పెరిగాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రతి ఏటా మార్చి నెలలో రోజుకు 330 టన్నుల నిమ్మకాయలు కలకత్తా, కరగపూర్, బీహార్, భువనేశ్వర్, కటక్, ఒరిస్సా రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. కానీ ఈ ఏడు మార్చి ప్రారంభం నుంచి రోజుకు 90 టన్నులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.
గరిష్ట ధర రూ.110
ఏలూరు జిల్లాలో 6,951 ఎకరాల 63 సెంట్లలో నిమ్మ పంట సాగు అవుతోంది. అయితే గతేడాది చివరి వరకు వర్షాలు పడటం, దానికి తోడు ఈ ఏడు మంచు విపరీతంగా కురవడంతో తోటల్లో నిమ్మకాయల దిగుబడి బాగా తగ్గింది. దాంతో కాయల ధరలు ఈనెల మొదటి నుంచి తగ్గుతూ.. పెరుగుతూ, పెరుగుతూ.. తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 9 నుంచి 11 వరకు కిలో నిమ్మకాయల ధర గరిష్టంగా రూ.110 పలికింది. ప్రస్తుతం వాటి ధర రూ.75 నుంచి రూ.85 పలుకుతోంది.
తీవ్ర సంక్షోభంలో రైతులు
ఈ ఏడాది ధరలుంటే.. కాయలు లేక, కాయలుంటే.. ధరలు లేక నిమ్మ రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆరేళ్ల క్రితం సీజన్‌లో నిమ్మదిగబడులు విపరీతంగా పెరిగినప్పుడు, సరైన ధరలు లేక రైతులు కాయలను కోసి, రోడ్ల పక్కన పారబోశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కాయల ధర భారీగా ఉన్నా.. తోటల్లో పంట దిగుబడి లేక నిమ్మ ధరలు ఆకాశాన్నంటాయి. దాంతో రైతులు తెల్లముఖం వేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు.
అతి పెద్ద ఏలూరు మార్కెట్ నుంచి..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, ద్వారకాతిరుమల, గొపన్నపాలెం, జంగారెడ్డిగూడెం, యాదవోలులో నిమ్మకాయల మార్కెట్ యార్డులు ఉన్నాయి. అందులో ఏలూరు మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలోనే అతి పెద్దది. రెండవ అతిపెద్ద మార్కెట్ నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఉంది. ఏలూరు మార్కెట్ నుంచి ప్రతి ఏటా మార్చి నెలలో రోజుకు 250 టన్నుల నిమ్మకాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు అదే మార్కెట్ నుంచి రోజుకు కేవలం 75 టన్నుల నిమ్మకాయలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.
మండలం విస్తీర్ణం
(ఎకరాల్లో)
ఆగిరిపల్లి 58.24
బుట్టాయగూడెం 21.36
చాట్రాయి 46.46
చింతలపూడి 208.63
దెందులూరు 754.77
ద్వారకాతిరుమల 1,989.77
ఏలూరు(అర్బన్) 22.74
జంగారెడ్డిగూడెం 768.63
జీలుగుమిల్లి 38.95
కామవరపుకోట 465.17
మండలం విస్తీర్ణం
(ఎకరాల్లో)
కొయ్యలగూడెం 93.62
కుక్కునూరు 8.28
లింగపాలెం 121.49
ముసునూరు 224.65
నూజివీడు 134.31
పెదపాడు 4.97
పెదవేగి 702.43
టి.నరసాపురం 1,274.79
ఉంగుటూరు 12.37
కాపులేక నిమ్మకాయల ఎగుమతులు ఢమాల్
ప్రతికూల వాతావరణంతో తగ్గిన దిగుబడులు
ప్రస్తుతం హెచ్చు తగ్గులతో కొనసాగుతున్న అధిక ధరలు
తోటల్లో కాయలు లేక నిమ్మ రైతుల దిగాలు
నిమ్మకాయల ఎగుమతులు బాగా పడిపోయాయి. గతేడాది చివర్లో చలి ఎక్కువగా ఉండటం, ఈ ఏడు అధిక మంచు కారణంగా తోటల్లో కాయలు సకాలంలో కాయలేదు. మార్చి మొదట్లో రావాల్సిన దిగుబడులు, ఏప్రిల్ నెలాఖరులో వచ్చేట్టున్నాయి. దాంతో నిమ్మకాయలు లేక ప్రస్తుతం మార్కెట్లు కుదేలయ్యాయి. ఓ పక్క వేసవి ఎండలు ముదురుతుండటంతో ఇళ్లల్లో, వ్యాపార దుకాణాల్లో, పరిశ్రమల్లో నిమ్మకాయల వినియోగం బాగా పెరిగింది.
– ముత్తిన సత్యన్నారాయణ, నిమ్మకాయల ఎగుమతుల
వ్యాపారి, గొల్లగూడెం, ద్వారకాతిరుమల మండలం
నాకు 80 సెంట్ల నిమ్మతోట ఉంది. ప్రతి ఏటా మార్చి సీజన్‌లో రోజుకు రెండు బస్తాల నిమ్మకాయలు కోతకు వచ్చేవి. కానీ ఇప్పుడు వారానికి ఒక బస్తా నిమ్మకాయలు మాత్రమే కోతకు వస్తున్నాయి. ప్రస్తుతం ధర బాగుంది. నిమ్మకాయలు బాగా కాచి ఉంటే లబ్ధిపొందేవాడిని. ఎక్కువ నిమ్మకాయలు కాస్తే ధర ఉండటం లేదు. తక్కువ కాచినప్పుడు మాత్రమే ధర పలుకుతోంది.
– బంటుమెల్లి సుబ్బారావు,
నిమ్మరైతు, సత్తెన్నగూడెం, ద్వారకాతిరుమల మండలం
గతేడాది డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు కారణంగా, ఈ ఏడాది మంచు ఎక్కువగా కురవడం వల్ల నిమ్మ పూత మాడిపోయింది. వేసవి ఎండలు ముందు నుంచే ఎక్కువగా ఉండటంతో వచ్చిన కాస్త పిందెలు కూడా రాలిపోయాయి. దాంతో నిమ్మ దిగుబడి తగ్గింది. ఈ ఏడు కాపు ఆలస్యం అవుతుంది. ఏలూరు జిల్లాలో ఎక్కువగా ద్వారకాతిరుమల మండలంలోనే నిమ్మ సాగవుతోంది.
– పీబీఎస్ అమర్‌నాథ్,
ఉద్యానశాఖ ద్వారకాతిరుమల మండల అధికారి


