నాణ్యమైన బేళ్లు తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన బేళ్లు తీసుకురావాలి

Mar 15 2026 1:20 AM | Updated on Mar 15 2026 1:20 AM

నాణ్యమైన బేళ్లు తీసుకురావాలి పెట్టుబడులు పెరిగాయి ●

వర్జీనియా రైతులు వేలం కేంద్రానికి నాణ్యమైన బేళ్లను తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆకు రెలుపు నుంచి బేళ్లను కట్టే వరకు ప్రతి దశలోనూ నాణ్యమైన పొగాకు ఉత్పత్తి అయ్యేలా పర్యవేక్షించుకోవాలి. ముఖ్యంగా అన్య పదార్థాలు లేకుండా చూసుకోవాలి. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా బేళ్లను తయారు చేసుకోవాలి. తద్వారా మంచి ధర పొందేందుకు అవకాశం ఉంటుంది.

– జె.సురేంద్ర కుమార్‌,

పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌

గత సీజన్‌లో వచ్చిన ధరల నేపథ్యంలో బ్యారన్‌ ధరలు, కౌలు ధరలు బాగా పెరిగాయి. దానికి తోడు సాగు ఖర్చులు కూడా పెరగడంతో ఈ ఏడాది వేలం ప్రారంభ ధర రూ.300 పైబడి పలికితే రైతుకు మేలు జరుగుతుంది. అలాగే సీజన్‌ ముగిసే నాటికి రూ.330 నుంచి రూ.350 వరకు సరాసరి ధర రావాలి. బయ్యర్లు కుమ్మకై ్క ధర తగ్గించే పరిస్థితులు రాకుండా అధికారులు పర్యవేక్షణ పటిష్టంగా చేయాలి.

– పరిమి రాంబాబు, వర్జీనియా పొగాకు సంఘ రైతు నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement