కుట్రలు.. కుతంత్రాలు | - | Sakshi
Sakshi News home page

కుట్రలు.. కుతంత్రాలు

Jan 1 2026 11:22 AM | Updated on Jan 1 2026 11:22 AM

కుట్ర

కుట్రలు.. కుతంత్రాలు

గిరిజనులపై దాడి చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు చంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలం

తణుకులో గందరగోళం

కై కలూరులో వివాదాలు

న్యూస్‌రీల్‌

యలమంచిలిలో చిల్లర రాజకీయాలు

పాలకొల్లులో కక్ష సాధింపుల పర్వం

పెదపాడులో బీభత్సం

గిరిజనులపై దాడి చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు
చంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలం

గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు.. వేధింపులు, అక్రమ కేసుల పేరుతో కూటమి కుతంత్రాలు గడిచిన సంవత్సరమంతా కొనసాగించారు. సామాన్య ఆటోడ్రైవర్‌ మొదలుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్తలు అందరిపైనా రకరకాల కేసుల పేరుతో వేధింపులు కొనసాగించారు. ఒకచోట ప్రత్యక్ష వేధింపులు కొనసాగిస్తే, మరోచోట పరోక్ష వేధింపులు, ఇంకొన్నిచోట్ల ఆస్తులు, చేపల చెరువుల విధ్వంసాలు.. ఇలా 2025 సంవత్సరమంతా కూటమి నేతలు సంక్షేమాన్ని విస్మరించి వేధింపులతో కాలం గడిపి అందినంత దండుకున్నారు. 2026లోనైనా జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను మొదలుకొని రోడ్ల నిర్మాణం వరకు అభివృద్ధి పనులు నిర్వహిస్తారా లేక ఇదే రీతిలో డైవర్షన్‌ రాజకీయాలతోనే కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

డైవర్షన్‌ రాజకీయాలతో సరి

ఉమ్మడి పశ్చిమలో దీర్ఘకాలిక పెండింగ్‌ ప్రాజెక్టులతో పాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రకటించిన సంక్షేమ పథకాలు లెక్కకు మించి అనేకం ఉన్నాయి. ప్రతిపక్షం ప్రశ్నించి ప్రజాపోరాటాలు ఉధృతం చేసినప్పుడల్లా కేసులు, డైవర్షన్‌ రాజకీయాలతో కాలం గడిపేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమలో రహదారులను సంక్రాంతి కల్లా పూర్తి చేస్తామని, గతేడాది సంక్రాంతి ముందు ప్రకటించారు. నేటికీ రెండు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు జరగక ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా మారిన పరిస్థితి. ఇక పునరావాస కాలనీల్లో సౌకర్యాలు, పోలవరం ప్రాజెక్టు వేగవంతం, ఏలూరు జిల్లాలో ఉపాధి కల్పించేలా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు, పలు క్లస్టర్ల ఏర్పాటు, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇలా అనేకం ఉన్నాయి. గడిచిన ఏడాదిలో వీటిల్లో ఏ ఒక్కటీ కూడా నామమాత్రపు పురోగతి కూడా ముందుకుసాగని పరిస్థితి. వీటన్నింటిని పక్కన పెట్టి స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొదలుకొని అన్నింటిలోనూ బలం లేకపోయినా అధికారం ఉందని అడ్డగోలుగా స్థానిక పదవులు దక్కించుకున్నారు.

రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఇలా..

జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో రెడ్‌బుక్‌ వేధింపులకు తెరతీశారు. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు, మూడు నెలల్లో 532 శిలఫలకాలను, సచివాలయ బోర్డులను ధ్వంసం చేశారు. నాలుగు మండలాల్లో ఇదే కొనసాగింది. ఇవికాక చేపల చెరువుల ధ్వంసాలు, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు పెద్ద ఎత్తున కొనసాగాయి.

మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ

తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాథాకృష్ణ మరో అడుగు ముందుకేసి మాజీ మంత్రి కారుమూరి ఇంటి ముట్టడి చేయించి తీవ్ర గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. గతేడాది అత్తిలి మండల ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి 13 మంది వైఎస్సార్‌ సీపీ సభ్యులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి చేరుకుంటే, వందలాది మంది టీడీపీ శ్రేణులు ఇళ్లు చుట్టుముట్టి నానా హంగామా సృష్టించి దాడికి యత్నించారు. స్థానిక ఎస్సై మొదలుకొని డీజీపీ వరకు అందరికీ ఫోన్లు చేసినా ఏ ఒక్కరూ స్పందించని పరిస్థితి. అలా రెండు రోజులుపాటు హడావిడి చేసి ఎంపీటీసీల్లో కొందరిని బెదిరించి మరీ టీడీపీలో బలవంతంగా చేర్చుకున్నారు.

కై కలూరులో ఎమ్మెల్యే కామినేని అండదండలతో జనసేన చోటానేత కొల్లి వరప్రసాద్‌ అలియాస్‌ బాబి రెచ్చిపోయారు. ఉప ఎన్నిక సందర్భంగా దాడి ఘటనతో పాటు పలు వివాదాలకు కేంద్రబిందువు అయ్యాడు. అలాగే కూటమి ముసుగులో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శిలాఫలకాలు ధ్వంసం చేశారు.

యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నామమాత్రపు బలం లేకపోవడంతో ఇదే తరహా చిల్లర రాజకీయాలతో మంత్రి నిమ్మల ప్రయత్నించి భంగపడ్డారు. ఎన్నికలను ఒకటికి రెండు పర్యాయాలు వాయిదా వేయించారు. చివరికి కోర్టు అధికారులకు చివాట్లు పెట్టడంతో వెంటనే నిర్వహించారు. ఈ ఎపిసోడ్‌లో తన విధులకు ఆటంకం కలిగించారని కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో 17 మందిపై, ఇదే తరహాలో వీఆర్‌ఓ ఫిర్యాదుతో 9 మందిపై కేసు నమోదు చేశారు.

పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కక్షసాధింపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. 2022 ఆగస్టు 5న టిడ్కో ఇళ్ల ప్రారంభం సందర్భంగా అప్పటి అధికార పార్టీకి రామానాయుడుకి మధ్య జరిగిన చిన్నపాటి వాదులాట ఘటనలో 2024 డిసెంబర్‌ 13న కేసు నమోదు చేయించారు. కోర్టులో కేసు కొనసాగుతుండగానే సీఐడీకి కేసు అప్పగించేలా ఒత్తిడి తీసుకువచ్చారు. వైఎస్సార్‌ సీపీ కీలక నేతలతో సహా అనేక మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించారు.

కూటమి దౌర్జన్య కాండ

వేధింపులతో గత ఏడాదంతా కూటమి రాజకీయం

అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి కుట్రలే అజెండా

గ్రామస్థాయి నుంచి సమన్వయకర్తల వరకు కేసుల పేరుతో వేధింపులు

కుట్ర రాజకీయాలతో స్థానిక సంస్థలు కై వసం

దాడులు తగ్గి జిల్లాలో సుపరిపాలన సాధ్యమేనా

పెదపాడు మండలం గుడిపాడులో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడికి చెందిన 6 ఎకరాల చేపల చెరువులో పట్టుబడులను అడ్డుకోవడం, రహదారి ధ్వంసం చేయడం, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడం.. బాధితుడు న్యాయం చేయమని పురుగుల మందుడబ్బాతో ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేసినా పెద్దగా స్పందన లేని పరిస్థితి. ఈ తరహా ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి నివాసం వద్ద కొల్లేరువాసుల ముసుగులో టీడీపీ కార్యకర్తలే ఆందోళన చేసి పొలంలో పంట ధ్వంసం చేసి పామాయిల్‌ గెలలు నరికి బీభత్సం సృష్టించారు. ఇక ఇదే నియోజకవర్గంలో పార్టీ నేతలు అనేక మందిని కేసులు, అరెస్టులతో వేధింపులతో కొనసాగిస్తూనే ఉన్నారు.

కుట్రలు.. కుతంత్రాలు 1
1/2

కుట్రలు.. కుతంత్రాలు

కుట్రలు.. కుతంత్రాలు 2
2/2

కుట్రలు.. కుతంత్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement