భీమవరం డీఎస్పీగా రఘువీర్ విష్ణు
భీమవరం: భీమవరం డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో కాకినాడ నుంచి రఘువీర్ విష్ణు డీఎస్పీగా నియమితులయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జయసూర్యపై విచారణకు అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. జయసూర్య తన పరిధిలో పేకాట క్లబ్బుల నిర్వహణ, కోడి పందేలు, ప్రైవేట్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారంటూ ఫి ర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఆయనపై ప్ర భుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల స త్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన బందో బస్తుకు వెళ్లిన జయసూర్య గాయం కావడంతో సెలవులో ఉన్నారు. ఈ తరుణంలో జయసూర్యను వీఆర్‌కు పంపిస్తూ మంగళగిరి డీఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది.


