క్రీస్తును హృదయంలో కొలవడమే క్రిస్మస్
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు: క్రీస్తును హృదయంలో కలిగి ఉండటమే క్రిస్మస్ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్య క్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మండలంలోని భుజబలపట్నం సీబీసీఎన్‌సీ చర్చిలో జరిగిన వేడుకల్లో గురువారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూ ప్రేమ, కరుణ, జాలి, దయ వంటి గుణాలను మానవాళికి అందించిన మహోన్నత వ్యక్తి ఏసుక్రీస్తు అని కొనియాడారు. ఆయన చూపిన మార్గం మానవాళికి ఆదర్శమన్నారు. నియోజకవర్గ క్రైస్తవ సోదరలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. చర్చి నిర్వాహకులు డీఎన్నార్ సన్మానించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగ కార్యదర్శి ఎండీ గాలిబ్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగ అధ్యక్షుడు ఉచ్చుల చినరాజు, జిల్లా మేధావుల విభాగ కార్యదర్శి సోమాల శ్యాంసుందర్, వివిధ హోదాల్లో నాయకులు సమయం అంజి, పెంటా అనిల్ కుమార్, దాసరి శ్యాంబాబు, సుధాకర్, జంగం మధు సుందరబాబు, మత్తె జంగం నిర్మల జ్యోతి, ఫిర్దోస్ ఖాన్, కన్నా బాబు, సుంకర శివ, ఈతకోట శీను, వల్లూరి నాగేంద్ర, జంగం జయచంద్రపాల్, దాసరి సుధీర్, పెనుగొండ దానియేలు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని కొవ్వలికి చెందిన కొవ్వలి వినియోగదారుల సేవా మండలికి రాష్ట్ర ఉత్తమ వినియోగదారుల సంఘం అవార్డు లభించింది. జాతీయ వినియోగదారుల దినోత్సవం–2025ను పురస్కరించుకుని రాష్ట్ర కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో పలువురు రాష్ట్రస్థాయి అధికారులు ఈ సంఘ ప్రతినిధి కట్టా సత్యనారాయణకు పురస్కారాన్ని అందించారు.
భీమవరం: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి, సుపరిపాలన దినోత్సవం సందర్భంగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు భీమవరం విష్ణు కాలేజీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300పైగా పా ర్లమెంట్ స్థానాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ 2014కు ముందు క్రీడాకారుల ఎంపికలో అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలేవని, గత దశాబ్ద కాలంలో ఆ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శకతను తీసుకువచ్చామని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం వ్యక్తిగత విజయం కోసమే కాకుండా దేశ గౌరవం కోసం, మువ్వన్నెల జెండా కీర్తిని విశ్వవ్యాప్తం చేయడం కోసం ఆడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఈనెల 23 నుంచి సంబరాల్లో భాగంగా క్రీడాకారులకు చెస్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ముగింపు వేడుకల్లో పోటీల్లో విజేతలకు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి బహుమతులు అందించారు.
దెందులూరు: భక్తుల పాలిట కొంగు బంగారం గాలాయగూడెంలోని అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయం వద్ద విద్యుత్ దీపాల కటౌ ట్లు ఏర్పాటుచేస్తున్నారు. ఉత్సవాలపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
క్రీస్తును హృదయంలో కొలవడమే క్రిస్మస్


