వైఎస్సార్ విరగహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ
● తణుకులో ఉద్రిక్తత
● నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: రాష్ట్రంలో ఎవరి ఇంట్లోకై నా వెళ్లిపో వచ్చన్నట్టుగా ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీ కట్టారంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమవుతుందని మండిపడ్డారు. ఏనాడైనా తాము ఎన్టీఆర్ విగ్రహానికి తమ నాయకుడి ఫ్లెక్సీ పెట్టామా అని ప్రశ్నించారు. తణుకు–తేతలి వై.జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబా బు, స్థానిక ఎమ్మెల్యే ఉన్న ఫ్లెక్సీ కట్టిన ప్రాంతంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. చంద్రబాబు ఫ్లెక్సీ విప్పనీయకుండా, తమ ఫ్లెక్సీ ఏర్పాటుచేయకుండా పోలీసులు కాప లా కాస్తున్నారని ఇది మరింత సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఫ్లెక్సీని తీయనీయకుండా పోలీసులు కాపలా కాస్తున్నారని, ఇదే తరహాలో అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో సైతం తన ఇంటి ముందు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినా ఒక్క పోలీసు కూడా రాకుండా ఆరోజు ఎమ్మెల్యే చెప్పినట్టుగా నడుచు కుని పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకువచ్చారని విమర్శించారు. తణుకులో లా అండ్ ఆర్డర్ సమస్య అంతా పోలీసుల కారణంగానే వస్తుందని విమర్శించారు. ఫ్లెక్సీ తొలగించకపోతే రోడ్డుపైనే ఉంటామని తమ రాష్ట్ర నాయకులు అంతా తణుకు వస్తారని హెచ్చరించారు. ఎటువంటి ఫ్లెక్సీలు లేకుండా చేస్తే విగ్రహం వద్ద నిర్మాణ పనులు చేసుకుంటామని చెప్పారు.
ఉద్రిక్తంగా తణుకు
తణుకు–తేతలి వై.జంక్షన్‌లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ పెట్టుకునేందుకు గురువారం సాయంత్రం వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అప్పటికే చంద్రబాబు, ఎమ్మెల్యే తదితరులు ఉన్న ఫ్లెక్సీ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు దిగడంతో పోలీసులు ఫ్లెక్సీని లాక్కుని స్వాధీనం చేసుకున్నారు. దీంతో వివాదం ముదరడంతో పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తీవ్రత తెలుసుకున్న మాజీ మంత్రి కారుమూరి హుటాహుటిన హైదరాబాద్ నుంచి రాత్రి సమయంలో తణుకు ఘటనా ప్రాంతానికి చేరుకుని పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అంతకుమందు పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులతో చర్చలు జరిపి నిరసన విరమించాలని కోరినా చంద్రబాబు ఫ్లెక్సీ తీయాల్సిందేనని నాయకులు పట్టుబట్టారు. ఘటనా ప్రాంతానికి తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్, తణుకు పట్టణ రూరల్ సీఐలు ఎన్.కొండయ్య, కృష్ణకుమార్, తాడేపల్లిగూడెం సీఐ బాదం శ్రీనివాస్, ఎస్సైలు తమ సిబ్బందితో కలిసి మొహరించారు. నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారామ్, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, తణుకు నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, ఎస్సీసెల్ అధ్యక్షుడు పెనుమాల రాజేష్, ఎడ్వర్డ్ పాల్, పైడి సాయిసూర్య, యారబాటి రామకృష్ణ, గెద్దా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన వివాదం
మాజీ మంత్రి కారుమూరి పోలీసులతో తీవ్ర వాగ్వాదాల నడుమ చంద్రబాబు ఫ్లెక్సీ ముందు వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ ఏర్పాటుచేయడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు శాంతించారు. శుక్రవారం సాయంత్రం రెండు ఫ్లెక్సీలు తొలగింపచేసేలా పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య ఒప్పందం కుదరడంతో వివాదానికి తాత్కాలికంగా తెరపడింది.
వైఎస్సార్ విరగహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ
వైఎస్సార్ విరగహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ


